Theft in KVP House: కాంగ్రెస్ నేత కేవీపీ ఇంట్లో డైమండ్ నెక్లెస్ చోరీ... పోలీసులకు ఫిర్యాదు...

Theft in KVP House: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఇంట్లో చోరీ జరిగింది. హైదరాబాద్‌లోని కేవీపీ నివాసంలో రూ.46 లక్షల విలువైన డైమండ్ నెక్లస్‌ చోరీకి గురైంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 31, 2022, 12:52 PM IST
  • కేవీపీ రామచంద్రరావు ఇంట్లో చోరీ
  • డైమండ్ నెక్లెస్ చోరీ అయిందని పోలీసులకు ఫిర్యాదు
  • బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు నమోదు
Theft in KVP House: కాంగ్రెస్ నేత కేవీపీ ఇంట్లో డైమండ్ నెక్లెస్ చోరీ... పోలీసులకు ఫిర్యాదు...

Theft in KVP House: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఇంట్లో చోరీ జరిగింది. హైదరాబాద్‌లోని కేవీపీ నివాసంలో రూ.46 లక్షల విలువైన డైమండ్ నెక్లస్‌ చోరీకి గురైంది. దీనిపై కేవీపీ సతీమణి సునీత బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 11న ఆ డైమండ్ నెక్లెస్ ధరించి తాను ఓ ఫంక్షన్‌కు హాజరయ్యానని... ఫంక్షన్ నుంచి ఇంటికి తిరిగొచ్చిన కాసేపటికి నెక్లెస్ కనిపించకుండా పోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంట్లో పనివాళ్లే నెక్లెస్ చోరీ చేసి ఉంటారని సునీత అనుమానం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ చోరీ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

కేవీపీ విషయానికొస్తే... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. కేవీపీ అంటే వైఎస్ ఆత్మ అనేంతగా పేరు పొందారు. వైఎస్ మరణం తర్వాత జగన్ కొత్త పార్టీ స్థాపించినప్పుడు కేవీపీ ఆయనతో కలుస్తారని భావించినప్పటికీ కాంగ్రెస్‌లోనే కొనసాగారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లోనే ఉన్నప్పటికీ క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అడపాదడపా ఏదైనా కార్యక్రమాల్లో కనిపించడం తప్పితే ఆయన ఇంటికే పరిమితమయ్యారు.  

Also Read:  MLC Kavitha: ఉద్యోగ కల్పనలో శ్రీలంకతో పోటీ.. మోడీ సర్కార్ ఫెయిల్ అన్న కవిత

Also Read: Rains in Telangana: వాతావరణ శాఖ హెచ్చరిక... నేడు, రేపు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x