Telangana Yellow Alert: తెలంగాణలో వణికిస్తున్న చలిగాలులు- హైదరాబాద్ లో ఎల్లో అలర్ట్!

Telangana Yellow Alert: తెలంగాణలో చలి తీవ్రరూపం దాల్చుతోంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో 15 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాగల మూడు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని.. దీంతో నగర వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ ప్రకటిస్తున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 4, 2022, 05:27 PM IST
    • తెలంగాణ వ్యాప్తంగా రాత్రివేళల వణికిస్తున్న చలిగాలులు
    • అత్యల్పంగా 10.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు
    • హైదరాబాద్ నగరంలో ఎల్లో అలర్ట్ ప్రకటించిన వాతావరణ అధికారులు
Telangana Yellow Alert: తెలంగాణలో వణికిస్తున్న చలిగాలులు- హైదరాబాద్ లో ఎల్లో అలర్ట్!

Telangana Yellow Alert: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల రాత్రివేళ ఉష్ణోగ్రతలు మరోసారి క్షీణించాయి. సోమవారం తెల్లవారుజామున సగటు కనిష్ట ఉష్ణోగ్రత 15.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. హైదరాబాద్ నగర శివారులోని శేరిలింగంపల్లిలో అతి తక్కువగా 11.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రిపోర్టు అయినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 

తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) అంచనా ప్రకారం.. రానున్నరోజుల్లో రాత్రి ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉంది. నగర శివార్లలోని కాప్రా, హయత్‌నగర్, ఉప్పల్, మలక్‌పేట్, ఫలక్‌నుమా వంటి ప్రాంతాల్లో మంగళ, బుధ, గురువారాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టవచ్చని వాతావరణ అధికారులు అంచనా వేశారు. 

హైదరాబాద్‌లోని భారత వాతావరణ శాఖ అధికారులు మాట్లాడుతూ నగరంలో రాత్రి ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని.. 11 డిగ్రీల సెల్సియస్ నుండి 15 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండే అవకాశం ఉందని తెలిపారు. భయంకరమైన చలిగాలుల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో మూడు రోజుల పాటు ఎల్లో అలర్ట్ ను వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. 

తెలంగాణలోని పలు జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా సాధారణ స్థాయి కంటే తక్కువగా నమోదయ్యాయి. సోమవారం కొమురం భీమ్ ఆసిఫాబాద్‌ జిల్లాలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 10.9 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రానున్న రెండు రోజుల్లో మేడ్చల్- మల్కాజిగిరి, నిర్మల్, జనగాం, సిద్దిపేట, వికారాబాద్ సహా పలు చోట్ల ఉష్ణోగ్రతలు మూడు నుంచి నాలుగు డిగ్రీలు తగ్గే అవకాశం ఉంది. 

రాష్ట్రంలో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రతలు

హైదరాబాద్ నగరంలో..

శేరిలింగంపల్లి - 11.9 డిగ్రీల సెల్సియస్
రాజేంద్ర నగర్ - 13.2 డిగ్రీల సెల్సియస్
పటాన్ చెరు - 13.8 డిగ్రీల సెల్సియస్
హయత్‌నగర్ - 14.4 డిగ్రీల సెల్సియస్
సికింద్రాబాద్ - 14.4 డిగ్రీల సెల్సియస్

రాష్ట్ర వ్యాప్తంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు

కొమురం భీమ్ ఆసిఫాబాద్  - 10.9 డిగ్రీల సెల్సియస్
వికారాబాద్ - 11.1 డిగ్రీల సెల్సియస్
సంగారెడ్డి - 11.3 డిగ్రీల సెల్సియస్
రంగారెడ్డి - 11.4 డిగ్రీల సెల్సియస్
ఆదిలాబాద్ - 11.9 డిగ్రీల సెల్సియస్.

Also Read: Covid-19 in Gurukul college: గురుకుల కళాశాలలో కరోనా కలకలం.. ముగ్గురు విద్యార్థినులకు పాజిటివ్!

Also Read: Crime News: పెద్దల్ని ఒప్పించలేక.. ఒకరికి దూరంగా మరొకరు ఉండలేక.. చావుతో ఒకటైన ప్రేమజంట!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News