Iphone 17 Air: యాపిల్‌ నుంచి బిగ్ అప్డేట్.. కొత్త iPhone 17 Air సిరీస్‌ వచ్చేస్తోంది.. పూర్తి వివరాలు!

Iphone 17 Air Launch Date: మార్కెట్‌లోకి ఐఫోన్ 17 ఎయిర్ (iPhone 17 Air) స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌ విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు లీక్‌ అయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
 

Iphone 17 Air Launch Date And Price: యాపిల్‌ కొత్త మొబైల్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? కేవలం మరి కొన్ని రోజుల పాటు వెయిట్‌ చేస్తే అద్భుతమైన యాపిల్‌ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కానుంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో ఎంతో స్లిమ్‌గా రాబోతోంది. దీనిని యాపిల్ కంపెనీ ఐఫోన్ 17 ఎయిర్‌ పేరుతో విడుదల చేయబోతోంది. ఇది చూడడానికి చాలా అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌, విడుదల తేది, ఇతర వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
  

1 /5

   యాపిల్ ఐఫోన్ 17 ఎయిర్‌ (iPhone 17 Air)  స్మార్ట్‌ఫోన్‌ అల్ట్రా-స్లిమ్‌ ప్రీమియం డిజైన్‌లో విడుదల కానుంది. అలాగే దీని బ్యాక్‌సెటప్‌ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. దీంతో పాటు ప్రత్యేకమైన కెమెరా లేఅవుట్‌ను కలిగి ఉంటుంది.  

2 /5

అలాగే ఈ యాపిల్ వివిధ మోడల్స్‌లో అందుబాటులోకి రానుంది. దీని ప్రత్యేకత ఏంటటంటే.. అల్ట్రా-థిన్ డిజైన్‌తో అందుబాటులోకి రానుంది. ఇది కేవలం 5.5 మిమీ మందం మాత్రమే ఉంటుంది. ఇప్పటి వరకు ఇంత థిన్‌తో ఎలాంటి ఫోన్‌ రాలేదు.. ఇది మార్కెట్‌లోకి లాంచ్‌ అయితే రికార్డులు బద్ధలు కొట్టే అవకాశాలు కూడా ఉన్నాయి.  

3 /5

ఐఫోన్ 17 ఎయిర్ (iPhone 17 Air)  స్మార్ట్‌ఫోన్‌ వివిధ కలర్‌ ఆప్షన్స్‌లో విడుదల కానుంది. దీంతో పాటు ఈ మొబైల్‌ ప్రత్యేకమైన పోర్టబిలిటీని కలిగి ఉంటుంది. ఇది బ్యాక్‌ సెటప్‌లో ప్రత్యేకమైన కెమెరా మాడ్యుల్‌ను కలిగి ఉంటుంది.  

4 /5

ఈ మొబైల్‌కి సంబంధించి కెమెరా లేఅవుట్‌ వివరాల్లోకి వెళితే.. ఐఫోన్ 17 ఎయిర్  స్మార్ట్‌ఫోన్‌ కొత్త కెమెరా సెటప్‌లో వస్తోంది. దీంతో పాటు ప్రత్యేకమైన LED ఫ్లాష్‌తో పాటు మైక్రోఫోన్‌ను కూడా అందిస్తోంది. ఇది కేవలం సింగిల్‌ కెమెరాను మాత్రమే కలిగి ఉంటుంది.  

5 /5

యాపిల్ ఐఫోన్ 17 ఎయిర్‌ (iPhone 17 Air)  స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన విడుదల వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ సెప్టెంబర్ 2025లో లాంచ్ చేయబోతున్నట్లు తెలిపింది. ఈ ఐఫోన్ 17 సిరీస్‌లో వివిధ రకాల మోడల్స్‌లో విడుదల కాబోతోంది. అంతేకాకుండా ఎన్నో అప్‌గ్రేడ్ ఫీచర్లతో రాబోతోంది.