Monalisa surprise to her mother with gold chain video: కుంభమేళ బ్యూటీ మోనాలీసా మరోసారి వార్తలలో నిలిచింది. ప్రస్తుతం ఆమె తన సినిమా ది డైరీస్ ఆఫ్ మణిపూర్ చిత్రానికి గాను ట్రైనింగ్ తీసుకుంటున్నారు. కొన్ని రోజులుగా మోనాలీసా తరచుగా వార్తలలో ఉంటున్నారు. ఇటీవల ఆమె ఒక జువెల్లరీ షోరూంను ఇనాగ్రేట్ చేసేందుకు వెళ్లారు. అంతే కాకుండా.. ఫ్లైట్ లో జర్నీ చేశారు. తన కుటుంబంతో కలిసి ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా భోజనం చేశారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం మోనాలీసా తాజాగా.. తనను చూసేందుకు వచ్చిన తల్లిని సర్ ప్రైజ్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
కుంభమేళ వైరల్ గర్ల్ కు ఇటీవల డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన మూవీ ది డైరీస్ ఆఫ్ మణిపూరీలో హీరోయిన్గా చాన్స్ ఇచ్చారు. దీనికి గాను ఆమెకు 25 లక్షలు పారితోషికం ఇస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అదే విధంగా పలు సంస్థలు తమ ప్రాడక్ట్ కు అంబాసిడర్ గా ఉండాలని ఆమెతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మోనాలీసాను చూసేందుకు ఆమె తల్లి వచ్చారు.
దీంతో మోనాలీసా తన తల్లిని ఊహించని విధంగా సర్ ప్రైజ్ చేసింది. ఆమెకు తన మొదటి పారితోషికం నుంచి గోల్డ్ చైన్ కొని.. తన తల్లికి గిఫ్ట్ గా ఇచ్చిమురిసిపోయింది. అంతే కాకుండా.. తన చేతుల్తో గోల్డ్ చైన్ ను తన తల్లి మెడలో వేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు కుంభమేళ బ్యూటీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
మరోవైపు మోనాలీసాకు నేపాల్ లో జరిగే శివరాత్రి ఉత్సవాలలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మోనాలీసా ట్రెండింగ్ గా మారారు. అయితే.. ఇటీవల కుంభమేళ బ్యూటీ మోనాలీసా డైరెక్టర్ సనోజ్ మిశ్రా వల్లో పడ్డారని.. ఆమెను అతగాడు మోసం చేస్తాడని ఒక ప్రొడ్యూసర్ వివాదాస్పదంగా మాట్లాడాడు. దీనిపై మోనాలీసా మాట్లాడుతూ.. తనను సనోజ్ మిశ్రా కూతురిలా చూసుకుంటాడని క్లారిటీ ఇచ్చింది.