BRS Party: అసభ్యకర రీతిలో.. వ్యక్తిగత దూషణలు చేస్తూ రేవంత్‌ రెడ్డి చేస్తున్న ప్రసంగం.. మాటలు చూస్తే ఇంట్లోవాళ్లు భయపడుతున్నారని.. అందుకే తెలంగాణలో టీవీలు బంద్‌ చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. రేవంత్ రెడ్డి మాట మీద నిలబడే రకం కాదని.. గతంలో కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించిన రేవంత్‌ రెడ్డి ఇప్పుడు ఏమైందని ప్రశ్నించారు. అలాంటి రేవంత్‌తో కేసీఆర్‌కు పోలికా అంటూ తప్పుబట్టారు. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష అని సంచలన ప్రకటన చేశారు.

Also Read: Padi Kaushik Reddy: 'రేవంత్ రెడ్డి 10 నెలల పాలనపై ప్రజలు ఛీ ఛీ.. థూ థూ అంటుండ్రు'

 

హైదరాబాద్‌లో బుధవారం ఇష్టాగోష్టిగా మీడియాతో బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు హరీశ్‌ రావు మాట్లాడారు. గాంధీ విగ్రహం కట్టిస్తానని రేవంత్‌ చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ.. 'కేసీఆర్ కట్టించిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి రేవంత్ దండం పెట్టలేదు. విగ్రహం చూడకుండా తాళాలు వేశారు' అని తెలిపారు. ఎగవేతల రెడ్డి అంటే నాపైన కేసులు పెట్టారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డిపై కేసు పెడితే ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదని చెప్పారు. రోజు సోషల్ మీడియా వారిపై కేసులు పెడుతున్నారని వివరించారు.

Also Read: Survey: తెలంగాణ సర్కార్‌ సంచలనం.. మళ్లీ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే

 

'రేవంత్ రెడ్డి తప్పుడు విధానాలతో రియల్ ఎస్టేట్ పడిపోయింది. రిజిస్ట్రేషన్లు పూర్తిగా తగ్గాయి' అని హరీశ్ రావు తెలిపారు. 'బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ మొత్తం యాక్టివ్ అయ్యింది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గోల్ కొట్టేది బీఆర్ఎస్ పార్టీనే. రేవంత్ రెడ్డి హిట్ వికెట్ కాకుండా సెల్ఫ్ గోల్ కాకుండా చూసుకోవాలి' అని సూచించారు. రేవంత్‌ పాదయాత్రకు తాము సిద్ధంగా రెడీగా ఉన్నామని ప్రకటించారు. టిప్పు ఖాన్ బ్రిడ్జి నుంచి పాదయాత్ర ప్రారంభిద్దామని తెలిపారు. హైదరాబాద్‌లో 144 సెక్షన్ తుగ్లక్ చర్య అంటూ తప్పుబట్టారు.

'బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో రూ.4.26 లక్షల కోట్ల అప్పులు చేశాం. ఈ అప్పుల్లో రెండేళ్లు కరోనా కూడా ఉంది. రేవంత్ రెడ్డి పది నెలల కాలంలో ఇప్పటివరకు రూ.85 వేల కోట్ల అప్పు తెచ్చారు' అని హరీశ్‌ రావు వివరించారు. 'ముఖ్యమంత్రి కుర్చీ గౌరవాన్ని రేవంత్‌ తగ్గించారు. రేవంత్ రెడ్డి మాట్లాడితే పిల్లలు చెడిపోతారని టీవీలు బంద్ చేస్తున్నారు. సీఎం మాటలు విని పిల్లలు పరీక్షల్లో రాస్తారని భయం వేస్తోంది' అని హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు.

కొడంగల్‌లో ఓడిపోతే రేవంత్‌ రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నాడు ఏమైంది? అని హరీశ్ రావు ప్రశ్నించారు. రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిన రేవంత్ రెడ్డి ఎంపీగా నిలబడ్డారని గుర్తు చేశారు. 'రుణమాఫీ చేస్తామని చెస్తామని మాట తప్పారు. 31 రకాల సాకులతో రుణమాఫీ ఎగ్గొట్టారు. ఆరు మంత్రి పదవులు నింపడానికి అధిష్టానం నుంచి అనుమతి రావడం లేదు. ఉప స్పీకర్, చీఫ్ విప్‌ను పెట్టుకునే అర్హత రేవంత్‌కు లేకుండా పోయింది' అని తెలిపారు.

'రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి కేసీఆర్ భిక్ష. కేసీఆర్‌కు రేవంత్‌కు పొంతన ఉందా?' అని హరీశ్ రావు ప్రశ్నించారు. కేసీఆర్ అంటే ఫైటర్.. త్యాగశీలి అని అభివర్ణించారు. ఇప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీకి వంద సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. 'ఒక మంత్రి గవర్నర్‌ను కలిసి వచ్చాడు. మరో మంత్రి హెలికాప్టర్ కోసం అలిగారు. ఇంకో మంత్రి ఢిల్లీకి వెళ్లి వచ్చారు. ఇంకొంతమంది కాబోయే ముఖ్యమంత్రులమని సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నారు' అని వివరించారు. మూసీ సుందరీకరణ పేరిట పేదల ఇళ్లు కూల్చడానికి తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు.

'రేవంత్ రెడ్డి తప్పుడు కేసులకు భయపడం. తప్పులను కప్పిపుచ్చుకోవడానికి రేవంత్ రెడ్డి నాపై, కేటీఆర్‌పై అక్రమ కేసులు పెట్టాలని అనుకుంటున్నారు. కేటీఆర్ ప్రశ్నిస్తుండడంతోనే కక్ష కట్టారు. యాదాద్రిలో నేను పూజలు చేపిస్తే తప్పుడు కేసులు పెట్టారు. మేము ఏం చేసినా రాష్ట్ర ప్రయోజనాల కోసం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం పని చేశాం' అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

English Title: 
Revanth Reddy Chief Minister Post Alms Given By KCR Says Ex Minister Harish Rao Rv
News Source: 
Home Title: 

Harish Rao: రేవంత్ రెడ్డికి సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష: హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు

Harish Rao: రేవంత్ రెడ్డికి సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష: హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు
Caption: 
Harish Rao Chit Chat
Yes
Is Blog?: 
No
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Harish Rao: రేవంత్ రెడ్డికి సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష: హరీశ్ రావు సంచలనం
Ravi Kumar Sargam
Publish Later: 
No
Publish At: 
Wednesday, October 30, 2024 - 17:57
Created By: 
Ravi Kumar Sargam
Updated By: 
Ravi Kumar Sargam
Published By: 
Ravi Kumar Sargam
Request Count: 
18
Is Breaking News: 
No
Word Count: 
451

Trending News