Sankranti Special: సంక్రాంతికి బాంబు పేల్చిన తెలంగాణ ఆర్టీసీ.. ప్రత్యేక బస్సుల్లో భారీగా ధరల పెంపు

Telangana RTC Charges Hike For Sankranti Special Buses: సక్రాంతి పండుగకు తెలంగాణ ఆర్టీసీ భారీ బాంబు పేల్చింది. ప్రత్యేక బస్సుల్లో ప్రత్యేక ఛార్జీలు ఉంటాయని ప్రకటించింది. ఐదు రోజుల పాటు ఛార్జీలు పెంచుతున్నట్లు వెల్లడించడంతో ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 11, 2025, 12:48 PM IST
Sankranti Special: సంక్రాంతికి బాంబు పేల్చిన తెలంగాణ ఆర్టీసీ.. ప్రత్యేక బస్సుల్లో భారీగా ధరల పెంపు

Telangana RTC Charges Hike: సంక్రాంతికి పండుగకు తెలంగాణ ఆర్టీసీ భారీ షాక్‌ ఇచ్చింది. భారీగా ప్రత్యేక బస్సులు వేస్తూనే భారీగా ఛార్జీలు వసూళ్లు చేయడానికి సిద్ధమైంది. ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీల కన్నా అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు తెలిపింది. ఇక ఉచిత బస్సు సదుపాయాన్ని కల్పించనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్‌ నుంచి రాష్ట్రవ్యాప్తంగా.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు నడిపే ప్రత్యేక బస్సుల్లో అధిక ఛార్జీలు ఉంటాయని పేర్కొంది. ఈ మేరకు సవరించిన ఛార్జీలు కొన్ని రోజుల్లో అమల్లో ఉంటాయని తెలిపింది.

Also Read: KT Rama Rao: ఏసీబీ విచారణపై కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు.. 82 ప్రశ్నలు అడిగి సంపిండ్రు

ప్రత్యేక బస్సులు
సంక్రాంతిని పురస్కరించుకుని సొంతూళ్లకు వెళ్లే వారిని క్షేమంగా గ‌మ్య‌స్థానాల‌కు చేరవేసేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పూర్తిస్థాయిలో స‌న్న‌ద్ద‌మైంది. అతి పెద్ద పండుగ‌కు 6,432 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ నెల 10, 11, 12 తేదీల్లో ప్ర‌యాణికుల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండే అవ‌కాశం ఉండడంతో ఆ రోజుల్లో ప్ర‌త్యేక బ‌స్సుల‌ను అందుబాటులో ఉంచేలా ప్రణాళిక రూపొందించింది. ఈ నెల 19, 20 తేదీల్లో తిరుగు ప్ర‌యాణ ర‌ద్దీకి  సంబంధించి కూడా ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది.

Also Read: Beer Supply: బీర్ విక్రయాల బంద్‌పై ప్రభుత్వం సంచలన ప్రకటన! బీర్‌లు ఉంటాయా.. లేవా?

భారీ ఏర్పాట్లు
హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, ఉప్పల్‌ క్రాస్‌ రోడ్స్‌, ఆరాంఘర్‌, ఎల్బీనగర్‌ క్రాస్‌ రోడ్స్‌, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది. ఆయా ప్రాంతాల్లో ప్రయాణికుల సౌక‌ర్యార్థం పండల్స్, షామియానాలు, కుర్చీలు, విచారణ కేంద్రం, తాగునీరు, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేసింది.

అదనపు ఛార్జీలు
సంక్రాంతి పండుగ‌కు న‌డిపే  ప్ర‌త్యేక బ‌స్సుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ  జీవో ప్రకారం 1.50 వ‌ర‌కు టికెట్ ధ‌ర‌ల‌ను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం స‌వ‌రించింది. తెలంగాణ‌తో పాటు ఇత‌ర రాష్ట్రాల‌కు తిరిగే స్పెషల్ బస్సులకు మాత్రమే సవరించిన చార్జీలు వర్తిస్తాయి. ఈ నెల 10, 11, 12 తేదీల‌తో పాటు  తిరుగు ప్ర‌యాణ ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండే 19, 20 తేదిల్లో మాత్ర‌మే స‌వ‌రించిన చార్జీలు అమ‌ల్లో ఉంటాయి. స్పెష‌ల్ బ‌స్సులు మిన‌హా రెగ్యూల‌ర్ బ‌స్సుల్లో సాధార‌ణ చార్జీలే అమ‌ల్లో ఉంటాయి.

జీవో ఏం చెబుతోంది?
ప్రత్యేక బ‌స్సుల‌కు అయ్యే కనీస డీజిల్ ఖర్చులు, నిర్వ‌హ‌ణ మేరకు టికెట్ ధ‌ర‌ను స‌వ‌రించుకోవాలని 2003లో జీవో నంబర్ 16ను రాష్ట్ర ప్ర‌భుత్వం జారీ చేసిందని గుర్తుచేసింది. పండుగ‌లు, ప్ర‌త్యేక సంద‌ర్భాల్లో న‌డిచే స్పెష‌ల్ బ‌స్సుల్లో మాత్ర‌మే 1.50 వ‌ర‌కు టికెట్ ధ‌ర‌ల‌ను స‌వ‌రించుకునే వెసులుబాటు ఉందని పేర్కొంది. ప్ర‌భుత్వ ఉత్తర్వుల మేరకు ఈ సంక్రాంతికి కేవ‌లం 5 రోజులు పాటు టికెట్ ధ‌ర‌ల‌ను టీజీఎస్ఆర్టీసీ స‌వ‌రించింది.

ఉచిత బస్సు కొనసాగింపు
ప్రత్యేక బస్సుల్లో ఉచిత ప్రయాణం సదుపాయంపై ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రభుత్వ మహాలక్ష్మి పథకంలో భాగంగా సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా య‌థావిధిగా అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో రిజర్వేషన్‌కోసం www.tgsrtcbus.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. సంక్రాంతి ప్రత్యేక బస్సుల పూర్తి సమాచారం కోసం కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 సంప్రదించాలి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News