Attack on chilkur Balaji priest Rangarajan video: హైదరాబాద్ లోని మొయినాబాద్ లో ఉన్న చిలుకూరు బాలాజీ ఆలయంకు ప్రతిరోజు వేలాదిగా భక్తులు దర్శించుకుంటారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని వీసా బాలాజీగా చెప్తుంటారు. ఇక్కడి స్వామివారిని పిలిస్తే పలికే దైవంగా భావిస్తారు. ప్రతిరోజు కూడా భక్తులు భారీగా తరలివచ్చి.. ప్రదక్షిణలు చేసి తమకు వీసా తొందరగా రావాలని మొక్కులు మొక్కుకుంటారు. అవి తీరగానే వెంటనే ఆలయంకు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. అదే విధంగా ఇక్కడ ఉండే ఆలయ ప్రధాన పూజారీ రంగ సౌందర రాజన్ పై కొంత మంది దాడులు చేశారు. ముఖ్యంగా వీరంతా ఇక్ష్వాకు వారసులమని చెప్పుకున్నారు.
Chilkur Priest CS Rangarajan manhandled by individuals claiming Ikshwaku lineage
Dr. Soundararajan, his father, stated that individuals claiming to be Ikshwaku descendants, seeking to establish their version of Rama Rajya with private armies, attacked Rangarajan after he refused… pic.twitter.com/sk09EYZqvP
— Naveena (@TheNaveena) February 9, 2025
అంతే కాకుండా.. చిలుకూరులోని రంగరాజన్ ఇంటికి వెళ్లి తమతో సమావాసం చేయాలని కోరారు. దీనికి ఆయన నిరాకరించడంతో ఆయనపై దాడికి దిగారు. ఈ క్రమంలో ఆయనకు బెదిరింపులకు సైతం దిగారు. చిలుకూరు బాలాజీ ప్రధాన పూజారీ సౌందర రాజన్ ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఫిబ్రవరి 7న జరిగింది. ప్రస్తుతం పూజారీ సురక్షితంగా ఉన్నాడని, ఘటనకు కారణమైన వారి కోసం పోలీసులు విచారణ చేపట్టారు.
దేశ వ్యాప్తంగా చిలుకూరులో తన ప్రవచనాలతో అందరికి మంచి చెప్పే రంగరాజన్ గారిపై దాడి ఘటన వెలుగులోకి రావడంతో ప్రజలు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే వారిని పట్టుకుని చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు . ఈ ఘటన ఒక్కసారిగా తీవ్ర భయాందోళనలు కల్గించే అంశంగా మారింది.
Read more: Tirumala: శ్రీవారి భక్తులకు టీటీడీ భారీ శుభవార్త.. ఆ టికెట్లు ఇక నుంచి డబుల్.. డిటెయిల్స్..
ఈ ఘటనకు చెందిని వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిలో దాదాపు 20 మంది వ్యక్తులు రంగరాజన్ ను కింద కూర్చొబెట్టి మరీ వార్నింగ్ ఇస్తున్నట్లు స్పష్టంగా కన్పిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter