Tirumala: శ్రీవారి భక్తులకు టీటీడీ భారీ శుభవార్త.. ఆ టికెట్లు ఇక నుంచి డబుల్.. డిటెయిల్స్..

Tirupati news: తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులకు టీటీడీ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నేపథ్యంలో గతంలో రాష్ట్ర ప్రభుత్వ జీఏడీ నుంచి ఒక లేఖను రాశారు. దీనిపై టీటీడీ తీసుకున్న నిర్ణయం వార్తలలో నిలిచింది.

1 /5

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలకు ప్రతిరోజు లక్షలాదిగా భక్తులు తరలిస్తుంటారు.  కొంత మంది మెట్లమార్గంలో వెళ్లి స్వామివారిని దర్శించుకుంటే, మరికొందరు ప్రత్యేకంగా టీటీడీ ఏర్పాటు చేసిన సదుపాయాల ద్వారా స్వామివారిని దర్శించుకుంటారు.  ఇదిలా ఉండగా.. టీటీడీ ఇటీకల అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.

2 /5

ఇటీవల టీటీడీలో పనిచేస్తున్న అన్యమతస్థులను ఇతర శాఖల్లోకి లేదా వాలెంటరీ రిటైర్మెంట్ తీసుకునేలా చర్యలు చేపట్టింది. మొదటి విడతలో 18 మంది టీటీడీ ఉద్యోగుల్ని ఇతర శాఖల్లో బదిలీ చేస్తు టీటీడీ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ క్రమంలో ప్రస్తుతం  టీటీడీ శ్రీవారి భక్తులు మరో గుడ్ న్యూస్ చెప్పింది.

3 /5

తిరుమలలో రోజువారీగా అందిస్తున్న టికెట్లను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ సభ్యులకు ఉన్న వీఐపీ బ్రేక్ దర్శన కోటాను డబుల్ చేస్తు టీటీడీ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గతనెలలో రాష్ట్ర ప్రభుత్వ జీఏడీ నుంచి టీటీడీ ఒక రిక్వెస్ట్ లెటర్ ఇచ్చారు.ఈ క్రమంలో దీనికి అనుగుణంగా టీటీడీ చర్యలు తీసుకుంది.

4 /5

టీటీడీ అధికారులు.. ప్రస్తుతం ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ సభ్యులకు ప్రస్తుతం రోజువారీగా 50 వీఐపీ బ్రేక్‌ దర్శన కోటా టికెట్లను జారీ చేస్తున్నారు. దీన్ని తాజాగా.. 100కు పెంచుతూ టీటీడీ  తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.  

5 /5

మరోవైపు తిరుమలలో.. ఆధార్ కార్డు దర్శనం సమయంలో భక్తులు తప్పకుండా ఉండాలని టీటీడీ స్పష్టం చేసింది. ఈ క్రమంలో ప్రస్తుతం టీటీడీ దర్శనం కోటా టికెట్లు పెంచడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.