Ys Jagan Strategy: షర్మిలకు జగన్ షాక్, త్వరలో పార్టీలో మరో ఇద్దరు సీనియర్ కాంగ్రెస్ నేతలు

Ys Jagan Strategy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ నిజంగానే జగన్ 2.0 చూపిస్తున్నారా అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. వైసీపీ కీలక నేతలు పార్టీ విడిచి పోతున్నా ఆందోళన చెందకుండా తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. వైఎస్ సన్నిహితుల్ని టార్గెట్ చేశారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 9, 2025, 03:11 PM IST
Ys Jagan Strategy: షర్మిలకు జగన్ షాక్, త్వరలో పార్టీలో మరో ఇద్దరు సీనియర్ కాంగ్రెస్ నేతలు

Ys Jagan Strategy: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓటమి తరువాత వైఎస్ జగన్ వ్యూహం మార్చారు. సోదరి వైఎస్ షర్మిలకు పరోక్షంగా షాక్ ఇస్తున్నారు. తండ్రి వైఎస్ఆర్‌కు సన్నిహితంగా ఉన్న సీనియర్ కాంగ్రెస్ నేతల్ని లక్ష్యంగా చేసుకున్నారు. త్వరలో ఇద్దరు సీనియర్ నేతలు పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతోనే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును వైఎస్ జగన్ తనవైపుకు లాక్కోగలిగారు. ఆ తరువాత కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలు వైసీపీలో చేరినా ఇంకెంత మంది దూరంగా ఉండిపోయారు. ఇప్పుడు ఆ నేతలపై దృష్టి సారించారు వైఎస్ జగన్. కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నేతలు పార్టీలో వస్తామని చెప్పినా నాడు పట్టించుకోని జగన్ ఇప్పుడు ఆ నేతలను ఆహ్వానిస్తున్నారు. ఇటీవల మాజీ మంత్రి శైలజానాథ్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు మరో ఇద్దరు సీనియర్ నేతల పేర్లు విన్పిస్తోంది. 

ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి దాదాపుగా శూన్యమైంది. వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించినా ఏమాత్రం ప్రయోజనం లేకపోయింది. షర్మిల కూడా పార్టీ బలోపేతం కంటే అన్న జగన్ ను టార్గెట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకోవడంతో సీనియర్ కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి నెలకొంది. ఈ క్రమంలో జగన్ కాంగ్రెస్ సీనియర్ నేతలపై దృష్టి పెట్టడంతో వైసీపీలోకి చేరికలు దాదాపు ఖాయమని తెలుస్తోంది. ముఖ్యంగా నాడు వైఎస్ఆర్‌తో సన్నిహితంగా ఉన్న నేతలపై ముందుగా దృష్టి సారించారు. ప్రస్తుతం మాజీ మంత్రి రఘువీరారెడ్డి, మాజీ ఎంపీ పళ్ళంరాజుతో వైసీపీ ముఖ్యనేతలు చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చలు దాదాపుగా ఫలించినట్టు సమాచారం. త్వరలో వైసీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని తెలుస్తోంది. 

వైఎస్ఆర్ హయాంలో వ్యవసాయ శాఖ మంత్రిగా చేసిన రఘువీరారెడ్డి ప్రస్తుతం రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నారు. వైసీపీకు దూరంగా ఉన్నా ఎప్పుడూ జగన్‌కు వ్యతిరేకంగా లేరు. మరోవైపు మాజీ కేంద్ర మంత్రి పళ్లంరాజు ఉన్నారు. ఈయన కూడా ఎప్పుడూ వైఎస్ జగన్‌పై వ్యక్తిగతంగా విమర్శలు చేయలేదు. ఈ ఇద్దరూ చేరితే పార్టీకు కచ్చితంగా ప్లస్ కావచ్చు. ఈ ఇద్దరూ కాకుండా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌తో కూడా పార్టీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. 

Also read: Undavilli in Ysrcp: వైసీపీలో చేరనున్న ఉండవిల్లి అరుణ్ కుమార్, ముహూర్తం ఫిక్స్ అయినట్టేనా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News