VIVO X200 Pro Mini: త్వరలో వివో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. శక్తివంతమైన ఫీచర్లతో మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనున్న VIVO X200 Pro Mini హల్‌చల్ చేయనుందని అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ నెలలో ఇండియన్ మార్కెట్‌లో లాంచ్‌కు సిద్ధంగా ఉంది. ఈ ఫోన్ ఫీచర్లు, ఇతర ప్రత్యేకతల గురించి పరిశీలిద్దాం.
VIVO X200 Pro Mini ్నేది 6.3 అంగుళాల ఎమోల్డ్ ఎల్టీపీవో డిస్‌ప్లేతో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. 9400 చిప్తో శక్తివంతమైన బ్యాటరీ సామర్ధ్యం, ఫాస్ట్ ఛార్జింగ్, పవర్‌ఫుల్ కెమేరా, ర్యామ్ ఈ ఫోన్ ప్రత్యేకతలు. ఇందులో 5700 ఎంఏహెచ్ సామర్ధ్యం కలిగిన బ్యాటరీ ఉంటుంది. 90 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేయడంతో కేవలం 30 నిమిషాల్లో 90 శాతం ఛార్జ్ అవుతుంది.
ఇక కెమేరా విషయానికికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమేరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ సోనీ ఎల్‌వై 818 సెన్సార్ కలిగిన ప్రైమరీ కెమేరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్, 50 మెగాపిక్సెల్ డిజిటల్ జూమ్ పెరిస్కోప్ కెమేరా ఉంటాయి. ఇక సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 32 మెగాపిక్సెల్ కెమేరా ఉంటుంది. కనెక్టివిటీ అయితే బ్లూటూత్ 5.4, జీపీఎస్ కనెక్టివిటీ, 5జీతో ఉండి ఆండ్రాయిడ్ 15 ఆధారంగా పనిచేస్తుంది. ఇన్ని ఫీచర్లు కలిగిన ఈ ఫోన్ ధర 55 వేల నుంచి 65 వేల వరకూ ప్రీమియం విభాగంలో లాంచ్ కావచ్చని అంచనా ఉంది.
Also read: Indiramma Housing Scheme 2025: ఇందిరమ్మ ఇళ్లకు ఎలా అప్లై చేయాలి, మీ పేరు ఉందా లేదా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి