Smartphone Effects On Health: స్మార్ట్‌ఫోన్లు మన జీవితాలలో ఒక ప్రధాన భాగమైపోయాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ మొబైల్స్ వినియోగిస్తూ ఉంటున్నారు. చాలా మంది గంటల తరబడి వీటిని వాడుతున్నారు. దీని వల్ల శారీరక, మానసక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అలాగే కొంతమందిలో దీర్ఘకాలిక వ్యాధులకు కూడా దారి తీస్తోంది. నిజానికి కొంతమంది చిన్న పిల్లలో అనేక సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు కూడా మొబైలే కారణమని ఆరోగ్య నిపుణులు తెలుతున్నారు. స్మార్ట్‌ఫోన్ వాడడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో దాని కంటే ఎక్కువగానే నష్టాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే మొబైల్స్ అతిగా వినియోగించడం వల్ల కలిగే దృష్పభావాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
1. కంటి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం:
స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌ను అతిగా చూడడం వల్ల చాలా మందిలో కళ్లు పూర్తిగా పొడిగా మారిపోయి.. కంటి వెలుగు తగ్గి.. దృష్టి మబ్బుగా కనిపించడం వంటి సమస్యలు తలెత్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇప్పటికే కంటి మబ్బు వంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా మొబైల్ అతిగా చూడకపోవడం చాలా మంచిది..
2. నిద్రలేమి:
ఎక్కువగా స్మార్ట్‌ఫోన్ చూస్తే నిద్రలేమి సమస్యలకు కూడా దారి తీస్తోంది. దీని వల్ల నిద్ర హార్మోన్ మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. అలాగే కొంతమందిలో ఇది దీర్ఘకాలిక వ్యాధులకు కూడా కారణమవుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా మొబైల్‌కి దూరంగా ఉండాల్సి ఉంటుంది.
3. మెదడుపై ప్రభావం:
కొంతమందిలో అతిగా మొబైల్ చూడడం వల్ల ఏకాగ్రత తగ్గిపోవడం వంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. దీని వల్ల మెదడుపై తీవ్ర ప్రభావం కూడా పడుతుంది. అలాగే నేర్చుకునే సామర్థ్యం కూడా పూర్తిగా తగ్గుతుంది. కొంతమందిలో అనేక నరాల సమస్యలకు కూడా దారి తీస్తుంది.
4. భౌతిక సమస్యలు:
కొంతమందిలో అతిగా మొబైల్ వినియోగిస్తే శరీరం చురుకుదల కూడా పూర్తిగా తగ్గిపోతుంది. దీని వల్ల శరీర బరువు పెరుగుదల, మధుమేహంతో పాటు గుండె సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీస్తుంది. కాబట్టి అతిగా మొబైల్ చూడడం మానుకోండి.
5. మానసిక ఆరోగ్యంపై ప్రభావం
కొంతమందిలో అతిగా మొబైల్ చూడడం వల్ల మానసిక స్థితి పూర్తిగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. దీని వల్ల ఒత్తిడితో పాటు ఆందోళ, నిరాశ వంటి సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి అతిగా యువత స్మార్ట్‌ఫోన్ చూడడం మానుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
AlsoRead: HMPV Virus: దేశంలో వేగంగా వ్యాపిస్తున్న హెచ్ఎంపీవీ, ఏం చేయాలి, ఏం చేయకూడదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి