Apple 13 Price Drop: ఏంట్రా ఇంతా చీపా? రూ.2,999కే అమెజాన్‌లో Apple 13 మొబైల్‌.. ఎలా కొనాలో తెలుసా?

Apple 13 Price Drop: అత్యధిక తగ్గింపు ధరతో యాపిల్ మొబైల్‌ను కొనుగోలు చేయాలని అనుకుంటే ఇది అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. ప్రీమియం ఫీచర్స్ కలిగిన ఈ మొబైల్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా అత్యధిక తగ్గింపు ధరతో లభిస్తుంది. దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Oct 5, 2024, 10:16 AM IST
Apple 13 Price Drop: ఏంట్రా ఇంతా చీపా? రూ.2,999కే అమెజాన్‌లో Apple 13 మొబైల్‌.. ఎలా కొనాలో తెలుసా?

Apple 13 Price Drop: ప్రస్తుతం చాలామంది యువతకు యాపిల్ మొబైల్స్ కొనుగోలు చేయడం ఒక కలగా ఉంటుంది. కానీ దీనిని నెరవేర్చుకోలేక పోతారు. వీటి ధరలు సాధారణ మొబైల్స్ కంటే ఐదు రేట్లు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా వీటి మెయింటెనెన్స్ కూడా చాలా కాస్ట్లీయే.. దీని కారణంగా మధ్యతరగతి యువత వీటిని కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపరు. అయితే కొంతమంది పండగపూటల్లో ఈ కామర్స్ కంపెనీలు పెట్టి సేల్స్ లో భాగంగా వీటిని కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తారు. అప్పుడు వీటి ధరలు సగానికి సగం పడిపోతూ ఉంటాయి. ఇదిలా ఉంటే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా అమెజాన్‌లో యాపిల్ ఓల్డ్ మోడల్స్ మొబైల్స్ పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో భాగంగా యాపిల్ మొబైల్స్‌ను కొనుగోలు చేసే వారికి అత్యధిక తగ్గింపు లభిస్తుంది.

గతంలో మార్కెట్లోకి విడుదలైన యాపిల్ 13 (apple 13) ప్రస్తుతం ఆమెజాన్‌లో అత్యధిక తగ్గింపు ధరలో లభిస్తోంది. దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఒకప్పుడు మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ ప్రైస్ రూ.59,999 కాగా.. ఇప్పుడు అత్యధిక తగ్గింపు ధరతో లభిస్తోంది. ప్రస్తుతం ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ లో ఈ మొబైల్ ఆరు కలర్ ఆప్షన్ తో పాటు మూడు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్ పై ఏకంగా 28 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఇక ఈ మొబైల్ ద్వారా విషయానికొస్తే ప్రస్తుతం ధర రూ. 42,999కే అందుబాటులో ఉంది. అదనంగా తగ్గింపు పొందడానికి ఇతర డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. 

ఇక ఈ (apple 13) మొబైల్ పై ఉన్న బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ వివరాలు కి వెళితే.. 128 జీబీ కలిగిన సాధారణ వేరియంట్ను SBI బ్యాంక్ క్రెడిట్ కార్డును వినియోగించి పేమెంట్ చేసే వారికి రూ.2,200 వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగించి బిల్ చెల్లించే వారికి కూడా రూ. 2,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతోపాటు ఎస్బిఐ బ్యాంకు డెబిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేసే వారికి కూడా ప్రత్యేకమైన డిస్కౌంట్ లభిస్తుంది. ఇక ఈ డిస్కౌంట్ ఆఫర్స్ అన్నీ పోను ఈ మొబైల్ ను కేవలం రూ.40,999కే పొందవచ్చు. ఇవే కాకుండా దీనిపై అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది అమెజాన్.. ఈ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో భాగంగా ఎక్స్చేంజ్ ఆఫర్ ను వినియోగించి కొనుగోలు చేసే వారికి ఏకంగా రూ.40 వేల వరకు ఎక్స్చేంజ్ బోనస్ కూడా పొందవచ్చు. దీంతో ఈ ఆఫర్స్ అన్నీ పోను యాపిల్ 13 (apple 13) మొబైల్ ను కేవలం రూ.2,999కే పొందవచ్చు.

ఇదీ చదవండి:  Motorola G85 5G Discount Offer: ఇంత తగ్గింపా? ఫ్లిఫ్‌కార్ట్‌లో రూ.9,200కే Motorola G85 5G మొబైల్‌.. మరెన్నో డిస్కౌంట్‌ ఆఫర్స్‌!

ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే
6.1 ఇంచ్ డైగనల్
2532 x 1170 పిక్సెల్ రెసల్యూషన్
279ppi పిక్సెల్ డెన్సిటీ
సిరామిక్ షీల్డ్
HDR10 సపోర్ట్‌
A15 బయోనిక్ చిప్ ప్రాసెసర్
5-కోర్ CPU, 4-కోర్ GPU
16-కోర్ Neural Engine
డ్యూయల్ 12MP వైడ్, అల్ట్రా-వైడ్ కెమెరాలు
సెన్సార్-షిఫ్ట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్
ఫోటోనిక్ ఇంజిన్
నైట్ మోడ్, 4K వీడియో రికార్డింగ్
12MP TrueDepth ఫ్రంట్ కెమెరా
ఫేస్ ID, సెల్ఫీ మోడ్
4K వీడియో రికార్డింగ్
అప్‌టు 19 గంటల వైర్‌లెస్ ఇంటర్నెట్ సర్ఫింగ్ బ్యాటరీ
అప్‌టు 22 గంటల వీడియో ప్లేబ్యాక్
iOS 15 ఆపరేటింగ్ సిస్టమ్
5G, Wi-Fi 6, బ్లూటూత్ 5.0, GPS, NFC కనెక్టివిటీ

ఇదీ చదవండి:  Motorola G85 5G Discount Offer: ఇంత తగ్గింపా? ఫ్లిఫ్‌కార్ట్‌లో రూ.9,200కే Motorola G85 5G మొబైల్‌.. మరెన్నో డిస్కౌంట్‌ ఆఫర్స్‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News