దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఇవ్వాల్సి ఉన్న ఐజీఎస్టీ నిధులను(IGST funds) కేంద్రం విడుదల చేసింది. కేంద్రం విడుదల చేసిన రూ.35,298 కోట్ల నిధులలో భాగంగానే తెలంగాణకు రావాల్సి ఉన్న రూ.1,036 కోట్లను సైతం విడుదల చేసినట్టు కేంద్రం ప్రకటించింది.
తెలంగాణాలో మద్యాన్ని నిషేదించడంతో పాటు మద్యం నియంత్రణకు కఠినమైన విధానాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు డీకే అరుణ గురువారం హైదరాబాద్‌లోని ధర్నా చౌక్ వద్ద సంకల్ప దీక్ష ప్రారంభించారు. 12,13వ తేదీల్లో రెండు రోజుల పాటు డికె అరుణ దీక్ష కొనసాగనుంది.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ని కలిసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, నేరాల సంఖ్య అధికమయ్యాయని ఫిర్యాదు చేశారు. ప్రధానంగా రాష్ట్రంలో జరిగే సకల నేరాలు అన్నింటికి కూడా కారణభూతమైన మద్యాన్ని కంట్రోల్ చేయకపోతే ఈ నేరాల్ని అదుపు చేయడం కూడా కష్టతరమవుతుందని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టు కాంగ్రెస్ నేతలు తెలిపారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మె కాలంలో బస్సులు నడిపి ప్రజా రవాణా సౌకర్యానికి సహకరించిన తమకు ఆర్టీసీలో ఉద్యోగాలు కల్పించాలని తాత్కాలిక సిబ్బంది ప్రభుత్వాన్ని కోరారు.
టిఎస్ఆర్టీసీ(TSRTC) సంస్థ ఏర్పడిన తర్వాత రెండోసారి బస్సు ఛార్జీలను పెంచుతూ తెలంగాణ సర్కార్(Telangana govt) నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ కార్మికులను శుక్రవారం నుంచి విధుల్లో చేరాల్సిందిగా చెప్పిన సీఎం కేసీఆర్.. ప్రస్తుతం టిఎస్ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉన్నందున ఆర్టీసీ ఛార్జీలు(TSRTC fares) పెంచితే కానీ సంస్థ మనుగడ కష్టం అని తేల్చేశారు.
టిఎస్ఆర్టీసీ(TSRTC)ని భవిష్యత్తులో ఎలా నిర్వహిస్తే శాశ్వతంగా సమస్యలు రాకుండా ఉంటాయనే విషయంలో రవాణా శాఖ అధికారులు, నిపుణులతో కలిసి సీఎం కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారా అంటే అవుననే తెలుస్తోంది.
ఆర్టీసీ సమ్మె(TSRTC strike) విరమిస్తున్నట్లు ప్రకటించిన అశ్వద్ధామ రెడ్డి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సూర్యాపేట ఆర్టీసీ డిపోలో ఓ కార్మికుడు సోమవారం రాత్రి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.
ఆర్టీసీ కార్మికులు తిరిగి వారి విధుల్లో చేరేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం(Telangana govt) న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా వ్యవహరించాలని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కె.కృష్ణసాగర్ రావ్ డిమాండ్ చేశారు. సమ్మె(TSRTC strike) విరమించిన తర్వాత కూడా ఇంకా వారిని విధుల్లో చేరకుండా లేబర్ కోర్టు తీర్పు వచ్చేదాకా దెదిరింపు ధోరణికి పాల్పడటం అన్యాయమని అన్నారు.
తెలంగాణ హైకోర్టు చెప్పిన ప్రక్రియ ముగిసే వరకు చట్ట విరుద్ధమైన సమ్మెలో ఉన్న కార్మికులను తిరిగి విధుల్లో చేర్చుకోవడం సాధ్యం కాదని ఆర్టీసీ ఎండి సునీల్ శర్మ(TSRTC MD Sunil Sharma) తేల్చిచెప్పారు. తమంతట తాముగా సమ్మె(TSRTC strike)కు దిగి, ఇప్పుడు మళ్లీ విధుల్లో చేరడం చట్ట ప్రకారం కుదరదని.. కార్మికులు ఇప్పటికే యూనియన్ల(TSRTC JAC) మాట విని నష్టపోయారని ఆయన స్పష్టంచేశారు.
తెలంగాణలోని పాత జిల్లాల ప్రాతిపదికన ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించే విషయంలో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు.
టిఎస్ఆర్టీసీ సమ్మె(TSRTC Strike) ఆగలేదని.. సమ్మె ఇంకా కొనసాగుతూనే ఉందని టిఎస్ఆర్టీసీ జేఏసీ కన్వినర్ అశ్వత్థామ రెడ్డి(Ashwathama Reddy) అన్నారు. శనివారం హైదరాబాద్‌లో ఆర్టీసీ జేఏసీ(TSRTC JAC) నేతల సమావేశం జరిగింది.
కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్‌తో తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు బండి సంజయ్ కుమార్, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు భేటీ అయ్యారు. తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెను, సమ్మె అనంతరం జరుగుతున్న పరిణామాలు, కార్మికుల డిమాండ్లను కేంద్ర మంత్రికి వివరించిన ఎంపీలు... కార్మికుల సమస్యల పరిష్కారం దిశగా కృషిచేయాలని విజ్ఞప్తిచేశారు. ఆగస్ట్ 2019 గాను కార్మికులకు ఆర్టీసీ రూ. 80 కోట్ల బకాయిలు చెల్లించమని ఈపీఓ నుంచి డిమాండ్ నోటీస్ వచ్చిందని ఎంపీలు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
టిఎస్ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని టిఎస్ఆర్టీసీ జేఏసి కన్వినర్ అశ్వథ్థామ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వం కూడా హైకోర్టు తీర్పును గౌరవిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.
టిఎస్ఆర్టీసీ సమ్మె కాలంలో ప్రభుత్వం తమపై అవలంభించిన వైఖరిపై, సమ్మె సమయంలో ఛలో ట్యాంక్ బండ్ నిరసనలో పోలీసులు తమపై చేసిన దాడులను జాతీయ మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకెళ్తామని టిఎస్ఆర్టీసీ జేఏసి కన్వినర్ అశ్వత్థామ రెడ్డి స్పష్టంచేశారు. ఆర్టీసీ సమ్మెపై కఠినంగా వ్యవహరించిన కేసీఆర్ సర్కార్ వైఖరి కారణంగా ఆందోళనకు గురై ఆత్మహత్య చేసుకున్న కార్మికుల కుటుంబాలు, మిలియన్ మార్చ్ నిరసనలో పోలీసుల చేతిలో గాయపడిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలను తీసుకుని వెళ్లి గవర్నర్‌కి ఫిర్యాదు చేస్తామని అశ్వత్థామ రెడ్డి తెలిపారు.
ఆర్టీసీ సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం ఓ స్పష్టమైన నిర్ణయానికొచ్చినట్టు తెలుస్తోంది. ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌ను పక్కనపెడితేనే వారి డిమాండ్లను పరిశీలించాలని.. లేదంటే అవసరమే లేదని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా డిమాండ్ల పరిశీలనకు ఆర్టీసీ ఈడీలతో కమిటీని నియమించింది. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.