తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి. గత నాలుగైదు రోజులుగా రాష్ట్రంలో రోజువారీగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య సింగిల్ డిజిట్‌కే పరిమితం అవుతుండటం అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు కొంత ఊరటను కలిగిస్తోంది. మరోవైపు కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతుండటం విశేషం.
అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు తక్కువగా చేస్తున్నారని.. అందుకే రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులు సంఖ్య తగ్గుతోందని వస్తోన్న ఆరోపణలపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు.
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాపించడం (Coronavirus spread in Telangana) తగ్గిందా అంటే గత మూడు రోజులుగా నమోదవుతున్న సింగిల్ డిజిట్ కేసులను చూస్తోంటే అవుననే అనిపిస్తోంది.
తెలంగాణలో రోజూ వారీగా నమోదవుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గుతుండటం అటు తెలంగాణ సర్కార్‌కి ఇటు కరోనాతో ఆందోళనకు గురవుతున్న ప్రజానికానికి కొంత ఊరట కలిగిస్తోంది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 7కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా సోమవారం ఆ సంఖ్య 2కి పడిపోవడం గమనార్హం.
కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి తెలంగాణలో ఏరోజుకు ఆరోజు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ వస్తున్నప్పటికీ.. చాలా రోజుల తర్వాత శనివారం మాత్రం కొత్తగా వెలుగుచూసిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య సింగిల్ డిజిట్‌కే పరిమితమవడం విశేషం.
గచ్చిబౌలిలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కోవిడ్-19 ఆసుపత్రిని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రతినిధుల బృందం శనివారం తనిఖీ చేసింది. గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ విలేజ్‌లో కరోనా ఐసోలేషన్ కేంద్రానికిగాను ప్రత్యేకంగా 1,500 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
రైతుల శ్రేయస్సు కోరి 30 వేల కోట్ల రూపాయలు వెచ్చించి 100% ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకోగా మిల్లర్లు మాత్రం తరుగు పేరుతో ఇష్టమొచ్చినట్టు తూకంలో మోసం చేయడం ఎంత మాత్రం క్షంతవ్యం కాదని రాష్ట్ర రోడ్లు-భవనాలు, హౌసింగ్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
తెలంగాణలో శుక్రవారం 13 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 983కు చేరింది ఆయన అన్నారు.
తెలంగాణలో ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు 300 అన్నపూర్ణ సెంటర్ల ద్వారా దాదాపు 2 లక్షల మందికి ప్రతీ రోజు ఉదయం సాయంత్రం భోజనాన్ని అందిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు.
కరోనావైరస్ సంక్షోభంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. వారికి సంఘీభావం వ్యక్తంచేస్తూ శుక్రవారం నాడు తాను ఒక రోజు ఉపవాస దీక్ష చేపడతానని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రకటించారు.
తెలంగాణలో గురువారం కొత్తగా మరో 27 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. నేడు గుర్తించిన పాజిటివ్ కేసులలో 13 కేసులు జిహెచ్ఎంసి పరిధిలోనే ఉన్నాయి. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 970 కి చేరింది.
అసలే.. 'కరోనా వైరస్'.. ఆపై లాక్ డౌన్.. ఈ క్రమంలో వలస కూలీలు ఆగమాగమైపోతున్నారు. బతుకుదెరువు కోసం జన్మనిచ్చిన ఊరును వదిలి.. పొట్ట చేతపట్టుకుని రాష్ట్రాలకు రాష్ట్రాలు దాటి వచ్చేశారు. ఇప్పుడు కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా.. బతుకుదెరువు లేక.. బతికే మార్గం తెలియక.. మళ్లీ సొంతూళ్లకు తిరిగి వెళ్తున్నారు.
తెలంగాణలో బుధవారం కొత్తగా మరో 15 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. నేడు గుర్తించిన 15 కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య మొత్తం 943కి చేరింది. అందులో 725 మంది రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ విధించడంతో ప్రభుత్వాలకు పన్ను, ఇతరత్రా రూపంలో వచ్చే ఆదాయం పూర్తిగా పడిపోయిన సంగతి తెలిసిందే. దీనికితోడుగా కరోనా వైరస్‌ను నియంత్రించడం కోసం తీసుకుంటున్న చర్యలకు నిధుల విడుదల చేయాల్సి ఉండటంతో ప్రభుత్వాలకు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు.
కరోనావైరస్ లక్షణాలు ఉన్న అనుమానితులను నిర్దేశిత ఆస్పత్రులకు తీసుకెళ్లడంలో ఎదురవుతున్న ఇబ్బందులు, ఫలితంగా వైరస్ వ్యాపించే ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ సర్కార్ ఓ కొత్త పరిష్కారాన్ని కనుగొంది. ఇకపై అనుమానితులు తమ శాంపిళ్లు ఇవ్వడానికి ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వారి ఇళ్ల వద్దకే ఆరోగ్య శాఖ సిబ్బంది వెళ్లి బ్లడ్ శాంపిల్స్ సేకరించాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది.
ఏప్రిల్ నెల పన్నుల్లో భాగంగా రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటాను కేంద్రం విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు కలిపి 46వేల 38 కోట్లు రూపాయలు విడుదల చేయగా అందులో తెలంగాణకు రూ. 982 కోట్లు, ఆంధ్ర ప్రదేశ్‌కి రూ.1,892.64 కోట్ల రూపాయలు లభించాయి.
తెలంగాణలో లాక్ డౌన్ కారణంగా ఏ ఒక్కరు ఇబ్బంది పడకుండా ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ ఆర్థిక సహాయం అందజేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బ్యాంక్ ఖాతాలతో ఆధార్ కార్డు నెంబర్ లింక్ చేసుకోని వారి ఖాతాల్లో నగదు జమ కాకపోవడం నిజమేనన్న ఆయన.. అలా ఖాతాలో నగదు జమ కాని వారికి నేరుగానే నగదు అందిస్తామని తెలిపారు.
తెలంగాణలో శనివారం కొత్తగా మరో 43 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నేడు నమోదైన 43 కరోనా కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధికంగా 31 కేసులు నమోదు కాగా, గద్వాల్ జిల్లాలో 7, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2, రంగారెడ్డి జిల్లాలో 2, నల్గొండ జిల్లాలో ఒకటి ఉన్నాయి.
తెలంగాణలో గురువారం కొత్తగా మరో 50 కరోనా వైరస్ పాజిటివ్ కేసులను గుర్తించినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 700 మార్కును చేరుకున్నట్టయింది. నేడు రాష్ట్రంలోని ఆస్పత్రుల నుంచి 68 మంది డిశ్చార్జ్ అయ్యారు.
తెలంగాణలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 650కి చేరింది. తెలంగాణలో బుధవారం కొత్తగా నమోదైన 6 కరోనా పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 650కి చేరిందని వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.