Padma Bhushan Balakrishna: తాజాగా రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం హీరో నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది. ఈ నేపథ్యంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు బాలయ్యను ప్రత్యేకంగా అభినందించిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు బాలయ్యను ప్రత్యేకంగా కలిసి విషెస్ తెలియజేసారు. తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు బాలయ్యను సత్కరించారు.
Balakrishna: పదవులు తనకు అలంకారం కాదని, పదవులకు తానే అలంకారమని హిందూపురం తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. తనకు పద్మభూషణ్ అవార్డు రావడం పై నందమూరి బాలకృష్ణ హిందూపురంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
తాజాగా రిపబ్లిక్ డే సందర్బంగా కేంద్ర ప్రభుత్వం సినీ రంగంతో పాటు సామాజిక సేవా రంగాల్లో ఆయన చేసిన కృషికి గాను బాలకృష్ణు పద్మభూషణతో గౌరవించింది. బాలయ్యకు కేంద్రం దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం ప్రకటించడంతో ఆయనను విష్ చేస్తూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మాజీ మంత్రి సినీ నటుడు చిరంజీవితో పాటు జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అరవింద్ సహా పలువరు సినీ రాజకీయ ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలియజేసిన సంగతి తెలిసిందే కదా.
Padma Bhushan Balakrishna: నందమూరి బాలకృష్ణ.. యువర్న బాలకృష్ణ.. నట సింహా బాలకృష్ణ.. కాస్త నిన్న ప్రకటించిన పద్మ అవార్డుతో పద్మభూషణ్ బాలకృష్ణ అయ్యారు. నందమూరి తారక రామారావు నట వారసుడిగా సినీ రంగంలో 14వ యేట అడుగుపెట్టి అంచలంచెలుగా ఎదిగి టాలీవుడ్ అగ్ర హీరోగా సత్తా చాటుతూనే ఉన్నాడు. ఈయన గురించి కొన్ని విశేషాలు..
Padma Bhushan Awards 2025: కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్.. 76వ గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఇందులో సినీ రంగం నుంచి పలువురు ప్రముఖులకు పద్మఅవార్డులు ప్రకటించారు. అందులో తెలుగు అగ్ర కథానాయకుడిగా 50 యేళ్లుగా సత్తా చాటుతున్న నందమూరి బాలకృష్ణను కేంద్రం పద్మభూషణ్ తో సత్కరించింది. ఈయనతో పాటు తమిళ అగ్ర హీరో అజిత్, శోభన సహా ఇతర సినీ ప్రముఖులకు పద్మ అవార్డులు ప్రకటించడం విశేషం.
Balakrishna Nominated Padma Bhushan: తెలుగు సినీ కథానాయకుడు, తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను మరో ప్రతిష్ఠాత్మక అవార్డు వరించినుందా.. ? తాజాగా బాలయ్యను పద్మ భూషణ్ అవార్డుకు నామినేట్ చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ క్యాబినేట్ తీర్మానం చేసి కేంద్రానికి పంపినట్టు సమాచారం.
NBK@50Years: తండ్రి ఎన్టీఆర్ నుంచి నేను నేర్చుకున్నది నటన మాత్రమే కాదు. క్రమశిక్షణతో పాటు ఎన్నో ఉన్నాయి. నటుడిగా 50 యేళ్లు సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్బంగా స్టేజ్ పై భావోద్వేగానికి గురయ్యారు.
NBK@50Years: నందమూరి నట సింహం బాలకృష్ణ 50 యేళ్ల సినీ స్వర్ణోత్సవ వేడుక కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై బాలయ్య గురించి తమ మనుసులోని మాటలను పంచుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
NBK@50Years: నందమూరి తారక రామారావు నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బాలయ్య నటుడిగా 50 యేళ్లు నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ సినీ పరిశ్రమ నట సింహాన్ని ఘనంగా సత్కరించింది. ఈ సందర్బంగా బాలయ్య సినీ స్వర్ణోత్సవ వేడుకల హైలెట్స్ విషయానికొస్తే..
NBK@50 Years: తెలుగు చిత్రసీమలో అన్న ఎన్టీఆర్ నట వారసుడిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి తండ్రి తగ్గ తనయుడిగా రాణించాడు. ఈ రోజుతో 50 యేళ్ల సినీ స్వర్ణోత్సవాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 1న సినీ ఇండస్ట్రీ తరుపున బాలయ్యను ప్రత్యేకంగా సత్కరించబోతున్నారు. ఈ కార్యక్రమానికి సినీ ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు హాజరు కాబోతున్నారు. అందులో చిరు, అల్లు అర్జున్ సహా పలువురు సినీ ప్రముఖులకు ప్రత్యేక ఆహ్వానాలు అందాయి.
NBK@50Years: నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 యేళ్ల నట ప్రస్థానం పూర్తి చేసుకున్నారు. సరిగ్గా 50 యేళ్ల క్రితం ఈయన హీరోగా నటించిన ‘తాతమ్మ కల’ సినిమా 1974 ఆగష్టు 30న విడుదలై సంచలన విజయం సాధించింది. అంతేకాదు అన్న ఎన్టీఆర్ నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి సినీ వారసుడిగా 50 యేళ్ల నట ప్రస్థానం పూర్తి చేసుకున్నారు.
NBK@50 Years: తెలుగు చిత్రసీమలో ఎన్టీఆర్ నట వారసుడిగా సినీ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన బాలయ్య.. నటుడిగా ఈ నెల 30న 50 యేళ్ల సినీ స్వర్ణోత్సవాన్ని జరుపుకోబోతున్నారు. దీనికి సినీ ఇండస్ట్రీకి చెందిన చిరు సహా పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కాబోతున్నారు. తాజాగా బాలయ్య సినీ స్వర్ణోత్సవానికీ చంద్రబాబు నాయుడును ప్రత్యేకంగా ఆహ్వానించారు టాలీవుడ్ సినీ రంగ ప్రముఖులు.
NBK@50Years: అన్న ఎన్టీఆర్ నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన బాలయ్య.. ఈ నెల 29తో నటుడిగా సినీ పరిశ్రమలో 50 యేళ్ల నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నారు. కానీ వేడుకకు ఆ ఇద్దరు మాత్రం హాజరు అవుతారా లేదా అనేది ఫిల్మ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
NBK@50Years: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నందమూరి తారక రామారావు నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ ఈ నెల 29తో 50 యేళ్ల నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 1వ తేదిన ఫిల్మ్ ఇండస్ట్రీ తరుపున బాలయ్యను ఘనంగా సత్కరించనున్నారు. దానికి సంబంధించి కర్టెన్ రైజర్ ప్రోగ్రామ్ ఘనంగా జరిగింది.
Balakrishna@50Years: తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి బాలకృష్ణ మరో మైలురాయిని చేరుకోనున్నారు. అంతేకాదు త్వరలో నటుడిగా 50 యేళ్లు పూర్తి చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ తరుపున తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ బాలయ్యను ప్రత్యేకంగా సన్మానించబోతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.