Padma Bhushan Balakrishna: తాజాగా రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం హీరో నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది. ఈ నేపథ్యంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు బాలయ్యను ప్రత్యేకంగా అభినందించిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు బాలయ్యను ప్రత్యేకంగా కలిసి విషెస్ తెలియజేసారు. తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు బాలయ్యను సత్కరించారు.
Balakrishna: పదవులు తనకు అలంకారం కాదని, పదవులకు తానే అలంకారమని హిందూపురం తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. తనకు పద్మభూషణ్ అవార్డు రావడం పై నందమూరి బాలకృష్ణ హిందూపురంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
Chandrababu Funny Comments On Balayya: తన బామమరిది బాలకృష్ణ గురించి సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. బాలయ్య అల్లరిగా కనిపించినా.. లోపల చాలా డేడికేషన్ ఉందన్నారు. వసుంధరకు బాలయ్య టికెట్ అడిగి విషయం చెబుతూ అందరినీ నవ్వించారు.
తాజాగా రిపబ్లిక్ డే సందర్బంగా కేంద్ర ప్రభుత్వం సినీ రంగంతో పాటు సామాజిక సేవా రంగాల్లో ఆయన చేసిన కృషికి గాను బాలకృష్ణు పద్మభూషణతో గౌరవించింది. బాలయ్యకు కేంద్రం దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం ప్రకటించడంతో ఆయనను విష్ చేస్తూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మాజీ మంత్రి సినీ నటుడు చిరంజీవితో పాటు జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అరవింద్ సహా పలువరు సినీ రాజకీయ ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలియజేసిన సంగతి తెలిసిందే కదా.
Padma Bhushan Balakrishna: నందమూరి బాలకృష్ణ.. యువర్న బాలకృష్ణ.. నట సింహా బాలకృష్ణ.. కాస్త నిన్న ప్రకటించిన పద్మ అవార్డుతో పద్మభూషణ్ బాలకృష్ణ అయ్యారు. నందమూరి తారక రామారావు నట వారసుడిగా సినీ రంగంలో 14వ యేట అడుగుపెట్టి అంచలంచెలుగా ఎదిగి టాలీవుడ్ అగ్ర హీరోగా సత్తా చాటుతూనే ఉన్నాడు. ఈయన గురించి కొన్ని విశేషాలు..
Balakrishna Honored with Padma Bhushan: 76వ గణతంత్య్ర దినోత్సవం సందర్బంగా కేంద్రం 2025 యేడాదికి గాను పద్మ అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఇక తెలుగు రాష్ట్రాల్లో సినీ, సేవా రంగాల నుంచి నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఒకే ఇంటి నుంచి పద్మ అవార్డు అందుకున్న ఏకైక ఫ్యామిలీగా రికార్డు క్రియేట్ చేసింది. అయితే నందమూరి కుటుంబం కంటే ముందు కపూర్ ఫ్యామిలీలో తండ్రీ కొడుకులు పద్మ అవార్డులు అందుకున్నారు.
Balakrishna Padma Bhushan: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఎవరు ఉండరని మరోసారి పద్మ అవార్డుల వేదికగా మరోసారి ప్రూవ్ అయింది. 2019 ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీని బండ బూతులు తిట్టిన బాలకృష్ణను అవేమి పట్టించుకోకుండా.. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు.. బాలయ్యను దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ తో గౌరవించింది.
Balakrishna Padma Bhushan: 76వ గణతంత్య్ర దినోత్సవం సందర్బంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ .. దేశంలో వివిధ రంగాల్లో విశేష ప్రతిభను కనబరిచిన వారికి పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ సారి తెలుగు రాష్ట్రం నుంచి పలువురు ప్రముఖులకు పద్మ అవార్డులను అనౌన్స్ చేసింది. అయితే సినీ రంగం నుంచి నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్త మవుతోంది. అయితే బాలకృష్ణ అవార్డు రావడంపై అందరు అభినందలు తెలిపినా.. ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా చెప్పడం వైరల్ అవుతోంది.
Balakrishna as Padma Bhushan: దేశ అత్యున్నత పురస్కారాల్లో తెలుగు వారు సత్తా చాటారు. హీరో నందమూరి బాలకృష్ణకు కేంద్రం పద్మభూషణ్ పురస్కారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ తో పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, చిరంజీవి, ఎన్టీఆర్ సహా పలువురు ప్రముఖులు బాలయ్యకు అభినందనలు తెలియజేసారు.
Padma Bhushan Awards 2025: కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్.. 76వ గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఇందులో సినీ రంగం నుంచి పలువురు ప్రముఖులకు పద్మఅవార్డులు ప్రకటించారు. అందులో తెలుగు అగ్ర కథానాయకుడిగా 50 యేళ్లుగా సత్తా చాటుతున్న నందమూరి బాలకృష్ణను కేంద్రం పద్మభూషణ్ తో సత్కరించింది. ఈయనతో పాటు తమిళ అగ్ర హీరో అజిత్, శోభన సహా ఇతర సినీ ప్రముఖులకు పద్మ అవార్డులు ప్రకటించడం విశేషం.
Balakrishna Nominated Padma Bhushan: తెలుగు సినీ కథానాయకుడు, తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను మరో ప్రతిష్ఠాత్మక అవార్డు వరించినుందా.. ? తాజాగా బాలయ్యను పద్మ భూషణ్ అవార్డుకు నామినేట్ చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ క్యాబినేట్ తీర్మానం చేసి కేంద్రానికి పంపినట్టు సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.