ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిడ్ (Coronavirus) వ్యాక్సిన్ ప్రయోగాలను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే చివరి దశ ట్రయల్స్‌లో ఈ వ్యాక్సిన్‌ను తీసుకున్న ఓ వాలంటీర్‌కు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో దీనిని నిలిపివేస్తున్నట్లు ఆక్స్‌ఫర్ట్ పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్‌లో చాలా మంది నాయకులు, ప్రజాప్రతినిధులు కరోనా (Coronavirus) బారిన పడి కోలుకుంటున్న సంగతి తెలిసిందే. జూలైలో ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా (Amzath Basha ) కరోనావైరస్ బారిన పడి కోలుకున్నారు.
తెలంగాణలో కరోనావైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. వైరస్ కేసులు, మరణాలు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. కొన్నిరోజుల నుంచి రాష్ట్రంలో ప్రతీరోజూ రెండువేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి.
భారత్‌లో కరోనావైరస్ ( Coronavirus) విలయతాండవం కొనసాగుతూనే ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రోజురోజుకూ కరోనా కేసులు, మరణాలు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. దీంతోపాటు.. ఇప్పటివరకు దేశంలో చేసిన కరోనా పరీక్షల సంఖ్య ఐదు కోట్లు దాటింది.
ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. కరోనా కారణంగా ఇప్పటికే లక్షలాది మంది చనిపోగా.. కోట్లాది మంది దీనిబారిన పడ్డారు. ప్రస్తుతం ప్రపంచంలోని దేశాలన్నీ.. కరోనా నివారణకు రష్యా తయారు చేసిన ‘స్పుత్నిక్ వి’ వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్నాయి.
కరోనావైరస్ కారణంగా దేశంలోని పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాలన్నీ మూతబడిన విషయం తెలిసిందే. అయితే అన్‌లాక్-4లో భాగంగా సెప్టెంబరు 1 నుంచి ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాలన్నీ ఇప్పటికే తెరుచుకున్నాయి. అయితే యూపీలోని తాజమహాల్, ఆగ్రాఫోర్ట్ మాత్రం ఇంకా సందర్శకుల కోసం తెరుచుకోలేదు.
తెలంగాణ ప్రభుత్వ తీరుపై హైకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణలో కరోనా పరిస్థితులు, పరీక్షలు, బాధితులకు అందిస్తున్న చికిత్సపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలపై ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించగా.. హైకోర్టు అస్పష్టంగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది.
దేశవ్యాప్తంగా పలు పార్టీలకు చెందిన కీలక నేతలందరూ కరోనావైరస్ బారినపడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో కరోనా నుంచి కోలుకున్నాక కూడా మళ్లీ అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరుతున్నారు. ఈ క్రమంలో తాజాగా కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ సైతం శుక్రవారం మళ్లీ ఆసుపత్రిలో చేరారు.
భారత్‌లో కరోనావైరస్ ( Coronavirus) మహమ్మారి తీవ్ర స్థాయిలో విలయతాండవం చేస్తోంది. నిరంతరం రికార్డుస్థాయిలో కేసులు, మరణాల సంఖ్య నమోదవుతోంది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 40లక్షలకు చేరువలో ఉంది.
కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి దేశవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, అగ్రనేతలు కరోనా బారిన పడుతున్నారు. ఇటీవలనే పలువురు కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకూ కరోనా సోకిన విషయం తెలిసిందే.
తెలంగాణలో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి వ్యాప్తి వేగంగా విస్తరిస్తోంది. నిరంతరం కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఒక్క హైదరాబాద్ నగంలోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.