Jamili Elections: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ పార్టీ జిల్లా అధ్యక్షులు, కో ఆర్డినేటర్లు, ప్రధాన కార్యదర్శులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఆలోచనతో ఉండటంతో పార్టీని ఇప్పట్నించే క్షేత్రస్థాయిలో బలపరుస్తూ ప్రజల్లోకి వెళ్లే విధంగా దిశానిర్దేశం చేయనున్నారు.
వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సంక్రాంతి తరువాత ప్రజల్లోకి వెళ్లనున్నారు. జిల్లా స్థాయి పర్యటనలతో అటు పార్టీని పటిష్టం చేస్తూనే ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టే విధంగా చర్యలు తీసుకోనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ పార్టీ నాయకులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలకు సిద్ధమౌతుండటంతో పాటు 2027 ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా ఎన్నికలుంటాయనే ప్రచారం నేపధ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమౌతోంది. ఇప్పట్నించే పార్టీని బలోపేతం చేయాలని వైఎస్ జగన్ నిర్ణయించారు. ఇప్పటికే రీజనల్ కో ఆర్డినేటర్లను నియమించారు. పార్టీలో సీనియర్ నేతలకు కీలక బాధ్యతలు అప్పగించారు. కొన్ని నియోజకవర్గాలకు పాత వారినే నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల్లో నియోజకవర్గాలు మారినవారికి తిరిగి పాత నియోజకవర్గాలే అప్పగించారు.
పార్టీని బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు వైఎస్ జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలో బూత్ స్థాయి కమిటీలు ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో తీసుకెళ్లనున్నారు. సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం వైఫల్యమైందనే విషయాన్ని ప్రజల్లో తీసుకెళ్లేందుకు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించనున్నారు. విద్యుత్ ఛార్జీల భారం, ధాన్యం సేకరణలో విఫలం, కనీస మద్దతు ధర లేకపోవడం వంటి సమస్యలపై పోరాడే విధంగా పార్టీ నాయకులు, కార్యకర్తలను సిద్ధం చేయనున్నారు.
మరీ ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యార్ధులు ఎదుర్కొంటున్న ఫీజు రీయింబర్స్మెంట్ సమస్య, ఆరోగ్య శ్రీ అమలు కాకపోవడంపై ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా తగిన కార్యక్రమాలు అమలు చేయనున్నారు. జమిలీ ఎన్నికలు ప్రచారంలో ఉన్నట్టుగా 2027 ఫిబ్రవరిలో వస్తే పార్టీ సిద్ధంగా ఉండేలా ప్రణాళిక రచించనున్నారు.
Also read: Earth Quake in Telugu States: తెలుగు రాష్ట్రాలలో భూ ప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.