Pithapuram: డిప్యూటీ సీఎం ఇలాకా పిఠాపురంలో కలకలం.. పుష్ప 2 పోస్టులు చించివేత

Pawan Kalyan Fans Ripped Pushpa 2 The Rule Posters In Pithapuram: రాజకీయంగా భేదాభిప్రాయాలు ఉన్న మామ అల్లుళ్ల పవన్‌ కల్యాణ్‌, అల్లు అర్జున్‌ పంచాయితీ ప్రభావం 'పుష్ప 2: ది రూల్' సినిమాపై పడింది. ఈ సందర్భంగా పిఠాపురంలో ఆ పోస్టర్లు చించివేయడం కలకలం రేపింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Dec 4, 2024, 05:03 PM IST
Pithapuram: డిప్యూటీ సీఎం ఇలాకా పిఠాపురంలో కలకలం.. పుష్ప 2 పోస్టులు చించివేత

Pushpa 2 The Rule: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ఏర్పడిన రాజకీయ వివాదం కొణిదెల, అల్లు కుటుంబాల మధ్య తీవ్ర స్థాయిలే విభేదాలు కొనసాగుతూనే ఉంది. విభేదాలు కొనసాగుతున్న సమయంలో అల్లు అర్జున్‌ పుష్ప 2: ది రూల్‌ సినిమా విడుదలవుతుండగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ సినిమాను బహిష్కరించాలని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అభిమానులు పిలుపునిచ్చిన వేళ పిఠాపురంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పవన్‌ కల్యాణ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో అల్లు అర్జున్‌ సినిమా పోస్టర్లు తొలగించడం సంచలనంగా మారింది.

Also Read: Pushpa 2 High Court: 'పుష్ప 2' చూడాలంటే రూ.10 వేలు ఖర్చు చేయాల..? తెలంగాణ హైకోర్టు ఆగ్రహం

 

జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడుగా పురస్కారం పొందిన అల్లు అర్జున్ నటించిన పుష్ప సీక్వెల్‌ పుష్ప 2: ది రూల్‌ పోస్టర్లు పిఠాపురంలో చించివేశారు. పిఠాపురంలోని పూర్ణ, సత్య, శ్రీఅన్నపూర్ణ, అనుశ్రీ తదితర థియేటర్‌లలో పుష్ప సినిమా విడుదలవుతోంది. పుష్ప 2కు సంబంధించిన పోస్టర్లను పిఠాపురంలో అతికించారు. అయితే కొందరు ఈ పోస్టర్లను చించివేశారు. ముఖ్యంగా పోస్టర్‌లలో అల్లు అర్జున్‌ ముఖాన్ని చించివేశారు. రష్మిక మందన్నా ఫొటో మాత్రం చించలేదు. అంటే ఉద్దేశపూర్వకంగా కేవలం అల్లు అర్జున్‌ ముఖాన్ని చించడం చర్చనీయాంశంగా మారింది.

Also Read: Ram Gopal Verma: నా అరెస్ట్‌పై మీకు ఎందుకు తొందర.. కేసులపై న్యాయ పోరాటం చేస్తా'

 

రాజకీయంగా పవన్‌ కల్యాణ్‌ను విభేదించిన అల్లు అర్జున్‌పై పవన్‌ కల్యాణ్‌ అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. ఈ సందర్భంగా సినిమాను బహిష్కరించాలని కొన్ని చోట్ల పవన్‌ అభిమానులు పిలుపునిచ్చారు. దీంతో పిఠాపురంలో ఉద్రిక్తత నెలకొంది. పవన్‌ అభిమానులు సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్ల వద్ద ఆందోళన చేపట్టే అవకాశం ఉండడంతో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నట్లు సమాచారం. రాత్రికి ఈ వివాదం మరింత ముదిరే అవకాశం ఉంది.

అల్లు వర్సెస్‌ కొణిదెల కుటుంబం మధ్య విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో అందరి దృష్టి పిఠాపురంపై పడింది. ఇక్కడ అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకునే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు థియేటర్ల వద్ద బందోబస్తు ఏర్పాటుచేస్తున్నట్లు సమాచార. పవన్‌ అభిమానులు దాడికి దిగితే అదే స్థాయిలో ఎదుర్కొనేందుకు అల్లు అర్జున్ అభిమానులు సిద్ధంగా ఉన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News