IPL 2024: ఐపీఎల్ 2023నే కాదు ఐపీఎల్ 2022లో కూడా నిరాశాజనకంగా ఆట తీరు ప్రదర్శించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలకమార్పులు జరుగుతున్నాయి. ఈసారి ఏకంగా ఎస్ఆర్హెచ్ హెడ్ కోచ్ బ్రయన్ లారానే తొలగించేసింది. కొత్త వ్యక్తిని నియమించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పూర్వ వైభవాన్ని సంపాదించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఎందుకంటే గత రెండు ఐపీఎల్ సీజన్లలో ఆ జట్టు పేలవమైన ప్రదర్శన చూపించింది. ఐపీఎల్ 2023లో అయితే పాయింట్ల పట్లికలో అట్టడుగున నిలిచింది. వరుసగా మూడు సీజన్లలో అంటే ఐపీఎల్ 2021, ఐపీఎల్ 2022, ఐపీఎల్ 2023లో కనీసం ప్లే ఆఫ్‌కు చేరకపోవడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఐపీఎల్ 2024 కోసం సన్‌రైజర్స్ జట్టును పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు సిద్ధమైంది.
ఇప్పటికే జట్టులో కీలక ఆటగాళ్లుగా ఉన్న బ్రూక్, ఉమ్రాన్‌లను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తొలగించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈసారి జట్టు హెడ్ కోచ్‌గా ఉన్న బ్రయన్ లారాను తొలగించేసింది. జట్టును విజయం దిశగా నడిపించడంలో హెడ్ కోచ్ బ్రియన్ లారా ఘోరంగా విఫలమయ్యాడని జట్టు యాజమాన్యం ఆలోచనగా ఉంది. బ్రయన్ లారా స్థానంలో న్యూజిలాండ్ ఆల్ రౌండర్ డేనియల్ వెట్టోరీని నియమించింది. బ్రియన్ లారాతో ఉన్న రెండేళ్ల ఒప్పందం ముగిసిందని కూడా ప్రకటించింది ఎస్ఆర్హెచ్ జట్టు. డేనియల్ వెట్టోరీ గతంలో ఆస్ట్రేలియా జట్టు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించాడు. ఎస్ఆర్హెచ్ జట్టుకు బ్రియన్ లారా 2021-23 వరకూ హెడ్ కోచ్‌గా వ్యవహరించగా, ట్రెవర్ బేలిస్ 2020-21 వరకూ కోచ్‌గా పనిచేశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు అత్యధికకాలం హెడ్ కోచ్‌గా సేవలందించింది టామ్ మూడీ. 2013 నుంచి 2019 వరకూ చేశారు.
Also read: World Cup 2023: ప్రపంచకప్‌కు ఆసీస్ జట్టు ప్రకటన.. స్టార్ బ్యాట్స్‌మెన్‌కు మొండి చేయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook