Man and his mobile phone holy dip at prayag raj maha kumbh mela video: ప్రయాగ్ రాజ్ కుంభమేళలకు దేశం నలుమూలల నుంచి భక్తులు పొటెత్తుతున్నారు. మన దేశం నుంచి మాత్రమే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు తరగిస్తున్నారు. ఇదిలా ఉండగా.. కుంభమేళలో ఇప్పటి వరకు త్రివేణి సంగమంలో దాదాపు.. 50 కోట్లకు పైగానే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.
మరొవైపు కుంభమేళలో స్నానం ఆచరించేందుకు పసిపిల్లల నుంచి ముసలి వాళ్లవరకు అందరు ఆసక్తి చూపిస్తున్నారు. దాదాపు.. 144 ఏళ్ల తర్వాత ఏర్పడిన కుంభమేళ కావడంతో ఎలాగైన వెళ్లాలని తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం కుంభమేళలో కొంతమంది పుణ్యస్నానాలు ఆచరించడంలో కాస్తంతా వెరైటీగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల కొందరు తమ పెంపుడు శునకంకు కూడా కుంభమేళలో పుణ్యస్నానం ఆచరించపేశారు.
ఈ క్రమంలో తాజాగా.. ఒక యువకుడు తన మొబైల్ ఫోన్ కు కూడా మహా కుంభమేళ పుణ్యస్నానం చేయించాడు. సాధారణంగా మొబైల్ ను చాలా మంది ఆరోప్రాణంగా భావిస్తారు. ఒక్కనిముషం ఫోన్ కన్పించకుంటే.. ఏదో కోల్పోయినట్లు ఫీల్ అయిపోతుంటారు. ఇక కుంభమేళ లాంటి ప్రదేశంలో మొబైల్ ఫోన్ లు నీళ్లలో నానొద్దని చాలా జాగ్రత్తలు పాటిస్తారు. కవర్ లలో ఫోన్ లను పెట్టుకుంటారు.
అయితే.. ఒక యువకుడు అందరు చూస్తుండగానే తన ఫోన్ కు పుణ్యస్నానం చేయించాడు. ప్రయాగ్ రాజ్ నదిలో తన ఫోన్ తీసుకుని దానికి పుణ్యస్నానం చేయిస్తున్నానని కూడా వీడియో రికార్డు చేశాడు. ప్రస్తుతం ఇది వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరికొందరు అదేదో పాత ఫోన్ అయి ఉంటుంది.. జెస్ట్ పబ్లిసిటీ కోసం అతను అలా చేసి ఉంటాడని కూడా నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.