Bear hugging shivling in Bagbahara temple Chhattisgarh: కొన్నిసార్లు మూగ జీవాలు వింతగా ప్రవర్తిస్తుంటాయి. అచ్చం మనుషుల మాదిరిగా పూజలు చేస్తుంటాయి. భక్తి మీకేనా.. మాక్కుడా ఉంటుందనే విధంగా ప్రవర్తిస్తాయి. ఇటీవల కొన్ని జంతువుల ప్రవర్తన తరచుగా వార్తలలో ఉంటుంది. ఇటీవల శని సింగ్నాపూర్ లోని ఒక ఆలయంలో నల్ల పిల్లి.. శనిదేవుడి చుట్టు తిరుగుతూ ఉండిపోయింది. మరోక చోటు.. హనుమంతుడి విగ్రహాం దగ్గర వానరం గద పట్టుకుని విగ్రహాం ముందు హల్ చల్ చేసింది. ఏనుగులు కొన్నిసార్లు అడవిలో దేవుళ్ల ఆలయాల చుట్టు తిరుగుతు ఉంటాయి.
పాములు కూడా గుడిలోకి వెళ్లి శివలింగాన్ని చుట్టుకుని అక్కడే ఉండిపోయిన అనేక ఘటనలు మనం వార్తలలో చూశాం. ఈ క్రమంలో ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోను షేక్ చేస్తుంది. ఇక్కడ ఒక శివలింగాన్ని ఎలుగు బంటి హత్తుకుని అలాగా చాలా సేపు ఉండిపోయింది. దూరం నుంచి కొంత మంది ఈ ఘటనను తమ ఫోన్ లలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇది కాస్త వైరల్ గా మారింది.
ఛత్తీస్ గఢ్ లోని బగ్ బాహారాలోని చండీ మాత ఆలయం ఉంది. ఇక్కడ శివుడి లింగం ఉంది. ఈ ఆలయం అడవికి సమీపంలో ఉంటుంది. ఎలా వచ్చిందొ కానీ.. ఒక ఎలుగు బంటి అడవి నుంచి వచ్చింది. అది శివలింగం దగ్గరకు వెళ్లి దాన్ని భక్తితో హత్తుకుంది. మనకు కష్టం కల్గినప్పుడు... దేవుడి ఆలయం దగ్గరకు వెళ్లి.. ఆ దేవుడ్ని ప్రార్థించుకుంటాం.
అలాగే.. ఇక్కడ ఆ ఎలుగు బంటి వచ్చిందో కానీ.. శివలింగాన్ని హత్తుకుని చాలా సేపు అలానే లింగంపైన కూర్చుంది. దూరం నుంచి కొంత మంది శివాలయంలో ఎలుగు బంటి చేస్తున్న ప్రార్థనల్ని తమ ఫోన్ లలో రికార్డు చేశారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది.
Read more: Harsha Richhariya: కుంభమేళలో సందడి చేస్తున్న గ్లామరస్ సాధ్వీ.. హర్ష రిచారియా ఎవరో తెలుసా..?
ఈ వీడియో చూసిన నెటిజన్లు హర్ హర్ మహాదేశ్ అంటూ భక్తితో ఆ దేవుడ్ని స్మరించుకుంటున్నారు. అంతే కాకుండా.. భక్త మార్కాండేయుడు యమధర్మరాజు బారి నుంచి కాపాడాలని శివుడ్ని హత్తుకున్నట్లు.. అచ్చం ఈ ఎలుగు బంటి కూడా అదే విధంగా హత్తుకుందని కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ ఎలుగు బంటి వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది.