మరికొద్ది రోజుల్లో జరగబోయే రాజ్యసభ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల్లో దాదాపు 87 మంది కోట్లకు పడగలెత్తిన ధనవంతులేనని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఎన్నికలలో 63 బరిలో నిలవగా.. అందులో 55 మంది కోటీశ్వరులని తేలింది. ఇందులో జేడీయూకు చెందిన మహేంద్ర ప్రసాద్ ఆస్తుల విలువ రూ.4,078 కోట్లు కాగా, సమాజ్వాదీ పార్టీ నేత మరియు అమితాబ్ బచ్చన్ సతీమణి జయా బచ్చన్ రూ. 1,001కోట్లతో ద్వితీయ స్థానంలో ఉన్నారు.
ఇక జనతాదళ్-సెక్యూలర్ పార్టీకి చెందిన బీఎం ఫరూఖ్ రూ. 766కోట్లతో మూడవ స్థానంలో ఉండగా.. కాంగ్రెస్కు చెందిన అభిషేక్ మను సింఘ్వీ రూ. 649కోట్లతో నాల్గవ స్థానంలో.. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సీఎం రమేశ్ రూ. 258 కోట్లతో అయిదవ స్థానంలో ఉన్నారు ఇదే ఎన్నికల్లో బాగా తక్కువగా ఆస్తుల విలువ చూపించిన అభ్యర్థులు కూడా ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి చెందిన సమీర్ ఓరాన్ తనకు రూ. 18లక్షల విలువైన ఆస్తులను అఫిడివిట్లో చూపించగా.. కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రీయల్ టెక్నాలజీ అచ్యుత సమంత కేవలం రూ.4 లక్షలు మాత్రమే అఫిడివిట్లో చూపించడం గమనార్హం.