Vijayasai Reddy: రాజకీయాల్లో సంచలనం.. వైఎస్ షర్మిలతో విజయసాయి రెడ్డి భేటీ.. కారణం ఇదే..!

Vijayasai Reddy YS Sharmila Meet: ఏపీ కాంగ్రెస్ చీఫ్‌ వైఎస్ షర్మిలతో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి భేటీ అయినట్లు తెలుస్తోంది. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విజయసారెడ్డి.. వైఎస్ షర్మిలతో సమావేశం కావడం సంచలనం రేకెత్తిస్తోంది.  

Written by - Ashok Krindinti | Last Updated : Feb 2, 2025, 11:08 AM IST
Vijayasai Reddy: రాజకీయాల్లో సంచలనం.. వైఎస్ షర్మిలతో విజయసాయి రెడ్డి భేటీ.. కారణం ఇదే..!

Vijayasai Reddy YS Sharmila Meet: ఏపీ రాజకీయాల్లో సంచలనం రేకిత్తించే వార్త తెరపైకి వచ్చింది. రీసెంట్‌గా వైసీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసి రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన విజయసాయి రెడ్డి.. తాజాగా ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో భేటీ కావడంతో వైసీపీలో కలవరం మొదలైంది. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో షర్మిలతో విజయసాయి సమావేశమై.. దాదాపు మూడు గంటలపాటు చర్చలు జరిపినట్లు సమాచారం. ఏపీకి సంబంధించిన పలు రాజకీయ అంశాలను చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి భేటీ రాజకీయా వర్గాల్లో తీవ్రంగా చర్చగా మారింది. రాజకీయాలను తప్పుకుని వ్యవసాయం చేసుకుంటా అంటూ ఇటీవల ప్రకటించిన విజయసాయి రెడ్డి.. సడెన్‌గా ఇలా షర్మిలతో భేటీ కావడం వెనుక మతలబు ఏంటి అని చర్చించుకుంటున్నారు.  

అన్న వైఎస్ జగన్‌తో విభేదాల కారణంగా వైఎస్సార్సీపీ నుంచి బయటకు వచ్చిన వైఎస్ షర్మిల తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. ఆ తరువాత కాంగ్రెస్‌లో విలీనం చేసి.. మళ్లీ ఏపీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్‌ ఓటమికి తీవ్రంగా ప్రచారం చేశారు. కడప నుంచి ఎంపీగా పోటీ చేసి.. వైఎస్ అవినాష్ రెడ్డి చేతిలో ఆమె ఓడిపోయారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ఎప్పటికప్పుడు నిలదీస్తూ.. ప్రభుత్వ తప్పులను వైఎస్ ఎత్తి చూపుతున్నారు.

ఇటీవల లండన్ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన మాజీ సీఎం జగన్‌కు రాజీనామా లేఖను విజయసాయి రెడ్డి పంపించిన విషయం తెలిసిందే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి. పార్టీ పదవులకు తన రాజీనామాను పార్టీ అధ్యక్షులు  జగన్ మోహన్ రెడ్డికి పంపించానని తెలిపారు. 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్ గారు భారీ మెజారిటీతో మరోసారి ముఖ్యమంత్రి కావాలని నిండు మనసుతో కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు. తన రాజకీయ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నానని చెప్పారు. శత్రుత్వాలకు, అపార్థాలకు అవకాశం ఇవ్వని విధంగా జీవించాలని వ్యవసాయ ప్రపంచంలో తన మరో ప్రస్థానాన్ని ప్రారంభించాని వెల్లడించారు.

అయితే ఇలా ప్రకటించిన విజయసాయి రెడ్డి.. సడెన్‌గా వైఎస్‌ షర్మిలతో ఎందుకు భేటీ అయ్యారని చర్చించుకుంటున్నారు. వైఎస్ జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న ఆయన.. అన్న-చెల్లలు మధ్య సమోధ్య కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నారా..? లేదా ఆయనే కాంగ్రెస్ వైపు పయణించేందుకు రెడీ అవుతున్నారా..? అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

Also Read: Tirumala Ratha Saptami: రథ సప్తమి పర్వదినం సందర్బంగా తిరుమలలో ఏడు వాహనాలపై ఊరేగనున్న మలయప్ప స్వామి..

Also Read: Telangana BC Survey: ఇవాళే కులగణన నివేదిక.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News