Bank Holidays: బడ్జెట్‌లో బ్యాంక్‌ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. మళ్లీ నిరాశ పర్చిన నిర్మలమ్మ

Two Days Bank Holidays News: బ్యాంకు ఉద్యోగులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న వారానికి రెండు రోజుల సెలవు దినాల ప్రకటన కోసం మరికొంత కాలం వేచి చూడాల్సిందే. బడ్జెట్‌లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయంపై ప్రకటన చేస్తారని బ్యాంక్ ఉద్యోగులు అందరూ అనుకోగా.. కేంద్రం ఆ దిశగా ఎలాంటి ప్రకటన చేయలేదు. 
 

1 /5

ప్రస్తుతం బ్యాంకులకు నెలలో ప్రతి ఆదివారంతోపాటు రెండో, నాలుగో శనివారాలు సెలవు దినాలుగా ఉన్నాయి. అంటే పబ్లిక్ హాలీ డేస్ కాకుండా.. ప్రతి నెల ఆరు రోజులు బ్యాంకులు పనిచేయవు.  

2 /5

అయితే వారంలో ఐదు రోజులు పని దినాలుగా మార్చాలని ఆల్‌ ఇండియా బ్యాంక్‌ అసోసియేషన్‌ చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తోంది.  

3 /5

ఐదు రోజులు పని దినాలు అయితే.. బ్యాంకుల పని వేళలు ప్రతి రోజూ మరో 40 నిమిషాలు పెరుగుతాయి. ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి ఆల్‌ ఇండియా బ్యాంక్‌ అసోసియేషన్‌ రిక్వెస్ట్ పంపించింది.  

4 /5

కేంద్రం అనుమతి ఇస్తే.. అనంతరం ఆర్‌బీఐ కూడా ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటుంది. బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని బ్యాంక్ ఉద్యోగులు ఆశలు పెట్టుకోగా.. ఎలాంటి ప్రకటన వెలువడలేదు.  

5 /5

వారానికి రెండు సెలవు దినాలపై కేంద్రం నిర్ణయం తీసుకోకపోవడం బ్యాంక్ ఉద్యోగులు నిరాశకు గురవుతున్నారు. మోదీ సర్కార్ నుంచి ప్రకటన కోసం మరికొంత కాలం వేచిచూడాల్సిందే.