Caste Census: తెలంగాణలో తేలిన కులాల లెక్కలు, ఏ కులం జనాభా ఎంతో తెలుసా

Caste Census: తెలంగాణలో కుల గణన పూర్తయింది. ఎన్ని విమర్శలు వచ్చినా, ఎవరెన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. రాష్ట్రంలో కులాల లెక్కలు తేల్చింది. ఏ కులం జనాభా ఎంత ఉందో తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 3, 2025, 07:15 AM IST
Caste Census: తెలంగాణలో తేలిన కులాల లెక్కలు, ఏ కులం జనాభా ఎంతో తెలుసా

Caste Census: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కుల గణన సర్వే పూర్తయింది. తుది నివేదికను ప్లానింగ్ కమీషన్ కేబినెట్ సబ్ కమిటీకు అందించింది. దీనికి సంబంధించిన వివరాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో ఇకపై సంక్షేమ పధకాల అమలుకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. 

తెలంగాణ ప్రభుత్వం ఆర్ధిక, సామాజిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సంబంధిత అంశాలపై అధ్యయనం కోసం 50 రోజులపాటు చేపట్టిన కుల గణన సర్వే పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా 1 కోటి 12లక్షల 15 వేల కుటుంబాలను సర్వే చేసింది కుల గణన కమిటీ. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ పథకాల అమలులో ఏ కులం జనాభా ఎంత ఉందనేది తెలియక ఇబ్బందిగా మారింది. ఇప్పుడు కుల గణన పూర్తవడంతో ఆ ఇబ్బంది ఉండదని ప్రభుత్వం చెబుతోంది. కుల గణన సర్వే కోసం రాష్ట్ర ప్రభుత్వ 96.9 శాతం మందిని ప్రశ్నించింది. స్పష్టంగా చెప్పాలంటే 3 కోట్ల 54 లక్షల 77 వేల 554 మందిని విచారించి ఈ సర్వే పూర్తి చేసింది. 16 లక్షలమందికి సంబంధించిన వివరాలు లభ్యం కాలేదు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బీసీలు 46.25 శాతం ఉన్నారని ప్రభుత్వం తేల్చింది. ఓసీ జనాభా 15.79 శాతం ఉంటే ఎస్సీ జనాభా 17.43 శాతం ఉంది. ఇక ఎస్టీలు 10.45 శాతం కాగా బీసీ ముస్లింలు 10.08 శాతం ఉన్నారని తేలింది. రాష్ట్రంలో మొత్తం ముస్లిం జనాభా 12.56 శాతంగా తేలింది. 

తెలంగాణలో ఏ కులం జనాభా ఎంత

బీసీ జనాభా                      1,61,09,179
ఎస్సీ జనాభా                       67,84,319
ఎస్టీ జనాభా                         37,05,929
ముస్లిం జనాభా                    44,57,012
బీసీ ముస్లింలు                    35,76,588
ఓసీ ముస్లింలు                       8,80,424
ఓసీ జనాభా                          44,21,115

రేపు జరిగే తెలంగాణ కేబినెట్ భేటీలో కుల గణన సర్వేను ఆమోదించి అనంతరం జరిగే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెడతారు. మరోవైపు జస్టిస్ షమీమ్ అఖ్తర్ నేతృత్వంలోని న్యాయ కమీషన్ చేపట్టిన ఎస్సీ ఉప కులాల వర్గీకరణ రిపోర్ట్ కూడా రేపే అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. 

Also read: Sandeep Reddy Vanga: ఎంక్వైరీలో అలా తేలింది..అందుకే సాయి పల్లవిని రిజెక్ట్ చేశా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News