AP TG MLC Elections 2025: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభం

AP TG MLC Elections 2025: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇవాళ్టి నుంచి ఎన్నికల వాతావరణం కన్పించనుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. ఇవాళ్టి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 3, 2025, 10:03 AM IST
AP TG MLC Elections 2025: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభం

AP TG MLC Elections 2025: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చెరో మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. రెండు రాష్ట్రాల్లో మొత్తం ఆరు గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఆ వివరాలు మీ కోసం..

ఏపీలో తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ , కృష్ణా-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం నియోజకవర్గాల టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల పదవీకాలం మార్చ్ 29తో ముగియనుంది. అదే విధంగా తెలంగాణలో మెదక్-నిజామాబాద్-అదిలాబాద్-కరీంనగర్ జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, మెదక్-నిజామాబాద్-అదిలాబాద్- కరీంనగర్ జిల్లాలో టీచర్స్ ఎమ్మెల్సీ, వరంగల్-ఖమ్మం-నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల పదవీ కాలం కూడా మార్చ్ 29తోనే ముగుస్తోంది. ఈ రెండు రాష్ట్రాల్లోని మొత్తం 6 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల నోటిఫికేషన్ ఇది.

ఫిబ్రవరి 3 నుంచి నామినేషన్ల స్వీకరణ
ఫిబ్రవరి 10 నామినేషన్‌లకు గడువు
ఫిబ్రవరి 11 నామినేషన్ల పరిశీలన
ఫిబ్రవరి 13 నామినేషన్ల ఉపసంహరణ
ఫిబ్రవరి 27 ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్
మార్చ్ 3 నుంచి మార్చ్ 8 వరకు ఓట్ల లెక్కింపు

Also read: Caste Census: తెలంగాణలో తేలిన కులాల లెక్కలు, ఏ కులం జనాభా ఎంతో తెలుసా>

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News