Pawan Kalyan-Nagababu : రాజ్యసభ సభ్యునిగా నాగబాబు పేరు ఎందుకు సడన్ గా తెరపైకి వచ్చింది..? పవన్ ఢిల్లీ టూర్ వెనుక అసలు కారణం ఇదేనా..? ఢిల్లీలో పవన్ ప్రతినిధిగా జనసేన తరుపున ఒక కీలక వ్యక్తిని నియమించాలని జనసేనాని అనుకుంటున్నారా..? దానికి తన సోదరుడు నాగబాబు సూటబుల్ పర్సన్ గా పవన్ భావిస్తున్నారా..? త్వరలో నాగబాబు కేంద్ర మంత్రి కూడా కాబోతున్నారా..?
Delhi Services Bill 2023: ఊహించిందే జరిగింది. ఢిల్లీ సర్వీసెస్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం బిల్లుని ఆమోదింపజేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Rajyasabha Elections: త్వరలో పది రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. కేంద్ర మంత్రి ఎస్ జై శంకర్ స్థానం కూడా ఖాళీ కానుండటంతో మరోసారి ఆ మంత్రికి అవకాశమిస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.
AP Special Status: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇక లేనట్టేనని మరోసారి స్పష్టమైంది. 25 మంది ఎంపీలనిస్తే హోదా ఎందుకు రాదో అన్న వైఎస్ జగన్ మాటలు సైతం నీరుగారిపోయాయి. ఆ వివరాలు మీ కోసం..
Venkaiah Naidu Farewell: భారత నూతన ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధనకర్ గెలిచారు. ప్రస్తుతం ఉప రాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు పదవి కాలం ఈనెల 10వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో రాజ్యసభలో వెంకయ్యనాయుడుకి వీడ్కోలు నిర్వహించారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వీడ్కోలు చర్చలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ ఉద్వేగానికి లోనయ్యారు.
Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికలు జరగాల్సిన 57 స్థానాల్లో దాదాపుగా 41 మంది అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. 15 రాష్ట్రాల్లో 41 మంది అభ్యర్థులకు ఎలాంటి పోటీ లేకపోవడంతో వారినే విజయం వరించింది. నామినేషన్ల ఉపసంహరణకు నిన్నటితో గడువు ముగియడంతో ఏకగ్రీవమైన స్థానాలను సీఈసీ ప్రకటించింది.
Jagga Reddy Comments:తెలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై రగడ కొనసాగుతోంది. దేని ఆధారంగా చేసుకుని అధికార పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేశాయని విపక్షాలు మండిపడుతున్నాయి.
YSRCP Candidates: ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ అభ్యర్థుల పేర్లు ఖరారు అయ్యాయి. దీనిపై సుదీర్ఘంగా చర్చించిన సీఎం జగన్ ..పేర్లను ఫైనల్ చేశారు. విజయసాయిరెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఆర్.కృష్ణయ్య, బీద మస్తాన్‌రావు పేర్లను వైసీపీ తరపున ఖరారు అయ్యారు. రాజ్యసభ అభ్యర్థుల జాబితాను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.
TS Rajyasabha: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..రాజ్యసభ సీట్ల భర్తీపై దృష్టి సారిస్తున్నారు. ఫామ్‌హౌస్ సాక్షిగా వివిధ సామాజిక వర్గాల సమీకరణాలపై విశ్లేషణ చేస్తున్నారు.
Prakash Raj: రాజ్యసభ ఖాళీల భర్తీకై నోటిఫికేషన్ వెలువడింది. తెలంగాణలో మూడు ఖాళీలు భర్తీ కానున్నాయి. ఇందులో ఓ స్థానానికి సినీ నటుడు ప్రకాష్ రాజ్ పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.
Privilege Motion Notice: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విభజన విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించిన టీఆర్ఎస్..ఏకంగా ప్రధాని నరేంద్రమోదీపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చింది.
Independence Day2021 Celebrations: సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్వి రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశ పార్లమెంట్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలిప్పుడు సంచలనంగా మారాయి. దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
Parliament Monsoon Session: పెగసస్ స్పై వేర్ వ్యవహారంపై సద్దుమణగడం లేదు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి విపక్షం ఆందోళన చేస్తూనే ఉంది. పెగసస్‌పై చర్చ జరగాలని పట్టుబడుతోంది.
Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికుల ధర్నా ఢిల్లీలో రెండవరోజు కూడా కొనసాగింది. ధర్నాకు మద్దతు పలికిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ న్యాయస్థానాల్లో పోరాటానికి పిలుపునిచ్చింది.
Rajyasabha Updates: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు బిల్లులకు వ్యతిరేకంగా ప్రతిపక్షాల నిరసన, పెగసస్ వ్యవహారంపై చర్చకు పట్టుబడటం ప్రధానంగా సాగింది.
Polavaram Project: పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. పోలవరం సవరించిన అంచనా వ్యయాన్ని కేంద్ర జలశక్తి శాఖ ఆమోదించింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయాన్ని రాజమండ్రికి తరలించే అంశంపై మార్గం సుగమం కానుంది.
Pension Scheme: కరోనా మృతుల కుటుంబాలకు కేంద్ర కార్మిక శాఖ గుడ్‌న్యూస్ అందించింది. మరణించిన కుటుంబసభ్యులకు పింఛన్ అందిస్తామని కేంద్రమంత్రి రామేశ్వర్ తెలీ రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు సమాధానంగా మంత్రి వివరించారు.
Loksabha Seats: భారత పార్లమెంట్‌లోని లోక్‌సభలో స్థానాల సంఖ్య పెంచాలనే ప్రతిపాదన చాలాకాలంగా ఉంది. ఈ ఆలోచన త్వరలో కార్యరూపం దాల్చవచ్చని తెలుస్తోంది. లోక్‌సభలో సీట్ల సంఖ్య రెట్టింపు కావచ్చనే వార్తలు విన్పిస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.