Gold Price Today: ప్రస్తుతం మార్కెట్ అంతా బంగారందే నడుస్తోంది. పసిడి ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. బంగారంపై పెట్టుబడి పెడితే అంతా లాభాలే అంటున్నారు మార్కెట్ నిపుణులు. పెళ్లిళ్ల సీజన్ కూడా కావడంతో బంగారం కొనుగోళ్లు పెరగనున్నాయి. ఈ క్రమంలో ఇవాళ దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
బంగారంపై కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తూ కేంద్ర బడ్జెట్ లో నిర్ణయం తీసుకోవడంతో ఏప్రిల్ నుంచి పసిడి ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. కస్టమ్స్ డ్యూటీని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. ఫలితంగా ఏప్రిల్ తరువాత బంగారం ధరల్లో భారీ తగ్గుదల కన్పిస్తుంది. ఇవాళ కూడా మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. గత కొద్ది రోజులుగా దూసుకుపోతున్న పసిడి ధరలకు ఇవాళ బ్రేక్ పడింది. 22 క్యారెట్ల బంగారంపై 10 రూపాయలు, 24 క్యారెట్ల బంగారంపై 10 రూపాయలు తగ్గింది.
హైదరాబాద్‌లో ఇవాళ 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 77 వేల 450 రూపాయలు ఉంది. అటు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 84 వేల 490 రూపాయలుగా ఉంది. ఇక విజయవాడలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 77,440 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 84,480 రూపాయలుంది. అదే విధంగా హైదరాబాద్ మార్కెట్లో వెండి ధర కిలో 1 లక్షా 7 వేల రూపాయలు ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 77,590 రూపాయలు కాగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 84,630 రూపాయలకు ట్రేడ్ అవుతోంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధ 77,440 రూపాయలు ఉంటే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 84,480 రూపాయలుగా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 77,440 రూపాయలు కాగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 84,480 రూపాయలుగా ఉంది.
Also read: Delhi Election Campaign: ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి తెర, బీజేపీ,ఆప్ మధ్య ఎవరికి విజయావకాశాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి