Railway Budget: కేంద్ర బడ్జెట్ లో రైల్వేలకు భారీగా నిధులు.. వందే భారత్ కు పెద్ద పీఠ..

  అంతేకాదు రైల్వేల పరంగా రాబోయే నాలుగైదేళ్లలో 4.6 లక్షల కోట్ల విలువైన కొత్త ప్రాజెక్టులు అమలు చేస్తామన్నారు. వీటిలో కొత్త లైన్లు వేయడం, డబ్లింగ్, నాలుగు లైన్లు చేయడం, కొత్త నిర్మాణాలు, స్టేషన్ల అభివృద్ధి, పైవంతెనలు, అండర్‌పాస్‌లు.. ఇలా చాలా ఉన్నాయని రైల్వేశాఖ తెలిపింది.  

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 2, 2025, 11:24 AM IST
Railway Budget: కేంద్ర బడ్జెట్ లో రైల్వేలకు భారీగా నిధులు.. వందే భారత్ కు పెద్ద పీఠ..

Railway Budget:  అంతేకాదు రైల్వేల పరంగా రాబోయే నాలుగైదేళ్లలో 4.6 లక్షల కోట్ల విలువైన కొత్త ప్రాజెక్టులు అమలు చేస్తామన్నారు. వీటిలో కొత్త లైన్లు వేయడం, డబ్లింగ్, నాలుగు లైన్లు చేయడం, కొత్త నిర్మాణాలు, స్టేషన్ల అభివృద్ధి, పైవంతెనలు, అండర్‌పాస్‌లు.. ఇలా చాలా ఉన్నాయని రైల్వేశాఖ తెలిపింది.  

మార్చి నెలాఖరులోపు 1,400 జనరల్‌ బోగీలు తయారు కానున్నట్టు తెలిపాయి. వెయ్యి రైల్‌ ఓవర్‌  బ్రిడ్జిల నిర్మాణానికి అనుమతులు లభించాయని తెలిపింది. సరకు రవాణా సామర్థ్యం గణనీయంగా పెరిగింది.  మార్చి 31 నాటికి 1600 కోట్ల టన్నుల సామర్థ్యాన్ని చేరుకుని, ప్రపంచంలో చైనా తర్వాత రెండోస్థానంలో నిలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.  ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేసరికల్లా నూరుశాతం విద్యుదీకరణ సాధించటమే లక్ష్యంగా పెట్టుకుంది రైల్వే. మరోవైపు రైల్వేల భద్రతకు ఈ నాలుగేళ్లు వెచ్చించనున్నారు. అందులో ఖర్చు చేసే  మొత్తాన్ని రూ.1.08 లక్షల కోట్ల నుంచి రూ. 1.16 లక్షల కోట్లకు పెంచామని రైల్వేశాఖ తెలిపింది.

ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

ఇదీ చదవండి:   గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!

2024-25 సవరించిన అంచనాల్లో రైల్వే భద్రతకు రూ. 1,14,062 కోట్లు కేటాయించగా, 2025-26 బడ్జెట్‌ అంచనాల్లో రూ.  1,16,514 కోట్లు ఇచ్చారు. ఏడాదికి 4వేల కిలోమీటర్ల కొత్త లైన్లు వేయనున్నారు.గడిచిన పదేళ్లలో 31,180 కి.మీ. కొత్త ట్రాక్‌లు నిర్మించారు. ఇది ఓ రికార్డు అని చెబుతున్నారు. అయితే.. సిగ్నలింగ్, టెలికంకు ఇచ్చిన కేటాయింపు రూ. 6,800 కోట్లేనని, కానీ వచ్చే ఐదేళ్లలో 44వేల రూట్‌ కిలోమీటర్లకు ‘కవచ్‌’ వ్యవస్థ ఏర్పాటు చేయాలనుకుంటున్నందున ఈ మొత్తం సరిపోదని భారత రైల్వేస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సిగ్నల్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్స్‌తెలిపింది.

ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News