Vallabhaneni Vamshi: టీడీపీ కార్యాలయంపై దాడి కసులో వల్లభనేని వంశీతో పాటు ఇతర నిందితుల నుంచి కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టాలని..వంశీతో పాటు మరో ఇద్దరు నిందితులను కస్టడీకి తీసుకోవాల్సి ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషన్‌పై ఇరు వైపులా వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను గురువారం వాయిదా వేశారు.
మరో వైపు.. జైల్లో ప్రత్యేక వసతులు కల్పించాలని వంశీ దాఖలుచేసిన పిటిషన్‌పై ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరిగింది. జైల్లో వంశీకి అందిస్తున్న వసతులు ఏంటో తెలపాలని జైలు సూపరింటెండెంట్‌కు జడ్జ్ నోటీసులు ఇచ్చారు. జైలు అధికారులు ఇచ్చిన వివరణ ఆధారంగా వసతుల కల్పనపై కోర్టు ఈ రోజు నిర్ణయం తీసుకోనుంది. వంశీ తరఫున మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో వంశీ ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మొత్తంగా వల్లభనేని వంశీ తర్వాత తెలుగు దేశం పార్టీ ఇపుడు కొడాలి నానిని టార్గెట్ చేయాలని చూస్తోంది.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
ఇందుకు కారణం వీళ్లిద్దరు జూనియర్ ఎన్టీఆర్ కు విధేయత ప్రకటించడమే. అంతేకాదు వీరిద్దరికీ తారక్ తో మంచి అనుబంధమే ఉంది. ఇక జూనియర్ ఎన్టీఆర్.. భవిష్యత్తులో తనకు ఎక్కడ థ్రెడ్ అవుతాడనే ఉద్దేశ్యంతో కొడాలి నాని, వంశీలను టార్గెట్ చేసి పార్టీ నుంచి బయటకు వెళ్లేలా చేసారనేది టాక్ వినిపిస్తోంది. మొత్తంగా ఎన్టీఆర్ తో క్లోజ్ గా ఉండటం మూలానా.. వాళ్లు టీడీపీ లోంచి బయటకు వచ్చి వైసీపీలో చేరారు. ప్రస్తుతం ఏపీలో తెలుగు దేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. దీంతో తమకు గిట్టని వాళ్లపై అదను చూసి కేసులో పెడుతూ భవిష్యత్తులో ఎవరైనా తమపై ఏదైనా వ్యాఖ్యలు చేయాలన్నా.. భయపడే పరిస్థితులు కల్పిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?
ఇదీ చదవండి: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.