Donald Trump: ఇండియా సహా ఇతర దేశాల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు అమెరికా చేస్తున్న ఆర్ధిక సహాయాన్ని తాజాగా డోనాల్డ్ ట్రంప్ నిలిపివేశారు. ఇండియాపై తన అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ఇండియాలో ఓటింగ్ శాతం పెంచేందుకు తామెందుకు సహాయం చేయాలని ప్రశ్నించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఓటర్స్ టర్నవుట్ ప్రాజెక్టులో భాగంగా అమెరికా చాలాకాలంగా వివిధ దేశాలకు ఆర్ధిక సహాయం అందిస్తోంది. ఇందులో ఇండియాతో పాటు బంగ్లాదేశ్, లైబీరియా, నేపాల్, మాలీ, మొజాంబిక్, కాంబోడియా వంటి దేశాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇండియాకు ప్రతి సారీ 21 మిలియన్ డాలర్లు చెల్లిస్తోంది. అయితే తాజాగా ఇండియాకు చేస్తున్న ఆర్ధిక సహాయాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిలిపివేశారు. అంతేకాకుండా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. భారత ఎన్నికల వ్యవస్థ, దేశంలోని పన్నుల విధానంపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫ్లోరిడాలోని మియామీలో ఏర్పాటైన ఎఫ్ఐఐ ప్రయారిటీ సదస్సులో ఈ కీలకమైన వ్యాఖ్యలతో చర్చనీయాంశమయ్యారు. ఇండియాకు ఆర్ధిక సహాయాన్ని నిలిపివేయడాన్ని ఈ సందర్భంగా ఆయన సమర్ధించుకున్నారు.
ఇండియా వద్ద చాలా డబ్బు ఉందని, ప్రపంచంలోనే అత్యధికంగా పన్నులు వసూలు చేసే దేశాల్లో ఇండియా ఒకటని డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. అలాంటప్పుడు ఆ దేశంలో ఓటింగ్ శాతం పెంచేందుకు తామెందుకు ఆర్ధిక సహాయం అందించాలని ప్రశ్నించారు. ఇండియాకు ఆర్ధిక సహాయం నిలిపివేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేసిన 24 గంటల్లో మరోసారి ఇదే అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. 21 మిలియన్ డాలర్లు అంటే చిన్న మొత్తం కాదన్నారు. ఇండియాలో ఓటర్ల సంఖ్యను పెంచుకునేందుకు అమెరికా ఎందుకు డబ్బు ఖర్చు పెట్టాలన్నారు.
#WATCH | Miami, Florida | Addressing the FII PRIORITY Summit, US President Donald Trump says, "... Why do we need to spend $21 million on voter turnout in India? I guess they were trying to get somebody else elected. We have got to tell the Indian Government... This is a total… pic.twitter.com/oxmk6268oW
— ANI (@ANI) February 20, 2025
ఎవరినో గెలిపించేందుకే
డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు అంతటితో ఆగలేదు. తాము పంపించే డబ్బులతో ఇండియాలో వేరొకరిని ఎన్నుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ నిర్దిష్ట అభ్యర్ధికి అనుకూలంగా ఎన్నికలను మలిచేందుకు తాము పంపించిన డబ్బుల్ని వినియోగించి ఉండవచ్చన్నారు. అమెరికాలోని బైడెన్ ప్రభుత్వం ఇండియాలో ఎవరినో గెలిపించేందుకు ప్రయత్నించిందన్నారు.
ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఇండియాలో దుమారం రేపుతున్నాయి. ట్రంప్ చెప్పిన ఆ మరెవరో ఎవరనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి. ఎందుకంటే అమెరికా పంపించిన డబ్బులు ఇండియాలో కేంద్ర ఎన్నికల సంఘానికే చేరుతుంటాయి.
Also read: Allu Arjun: అల్లు అర్జున్‌కు అరుదైన ఖ్యాతి, హాలీవుడ్ మేగజైన్ కవర్ పేజిపై బన్నీ ఫోటో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి