AP Telangana Weather Report: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఐఎండీ కూలింగ్ న్యూస్ అందించింది. ఎండవేడిమితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు ఉపశమనం కలగనుంది. రానున్న 2 రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడవచ్చని ఐఎండీ స్పష్టం చేసింది.
దేశంలో వాతావరణం మారుతోంది. దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మరోవైపు గంగా పరివాహక ప్రాంతం మీదుగా తెలంగాణ వరకూ ఆవహించి ఉన్న ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఉత్తర బంగ్లాదేశ్ నుంచి తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ మీదుగా సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి ఆవహించి ఉంది. ఫలితంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి.
ఉపరితల ద్రోణి కారణంగా ఇవాళ ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం పూర్తిగా భిన్నంగా పొడి వాతావరణం ఉంటుంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో రేపు, ఎల్లుండి కూడా వర్షసూచన ఉంది. మిగిలిన ప్రాంతాల్లో ఉష్ణోగ్రత సాధారణం కంటే 2-3 డిగ్రీలు ఎక్కువే ఉండవచ్చు. ఇక దక్షిణ కోస్తాంద్రలో అయితే ఇవాళ, రేపు, ఎల్లుండి మూడు రోజులు పూర్తిగా ఎండలు ఉంటాయి. రాయలసీమలో ఇవాళ, రేపు, ఎల్లుండి ఎండలు గట్టిగా ఉండవచ్చు. సాధారణం కంటే 3-4 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది.
తెలంగాణలో ఫిబ్రవరి 22న కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడచ్చు. అప్పటి వరకూ పూర్తిగా ఎండలు ఉంటాయి. ఉదయం వేళ మాత్రం పొగమంచు కన్పిస్తుంది. అటు హైదరాబాద్‌లో కూడా వాతావరణం పూర్తిగా పొడిగా ఉంటుంది.
Also read: Half Day Schools: విద్యార్ధులకు బిగ్ రిలీఫ్, త్వరలో ఒంటి పూట బడులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి