Anjana devi hospitalized news: మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవీ తీవ్ర అస్వస్థకు గురయ్యారని.. ఆమెను కుటుంబ సభ్యులు హుటాహుటీన ఆస్పత్రికి తీసుకెళ్లారని కూడా ఈ రోజు వార్తలు తెగ ప్రచారంలో ఉన్నాయి. దీనిపై చిరంజీవి అభిమానులు టెన్షన్ పడుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవీ ఆరోగ్యం సీరియస్ గా ఉందని, తెల్లవారు జామున ఆమెను కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారని ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఒకటే ప్రచారం జరుగుతుంది.
మరొవైపు చిరంజీవి నిన్ననే దుబాయ్ కు వెళ్లారు. ఆయన విమానంలో తన పెళ్లి రోజు వేడుకల్ని చేసుకున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా.. దీనిపై పవన్ కళ్యాణ్ చాలా ఎమోషన్ అయ్యారని, వెంటనే విజయవాడలోని తన కార్యక్రమాలు ముగించుకుని హైదరబాద్ కు ప్రయాణం అయ్యారని కూడా వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
అయితే.. దీనిపై మాత్రం సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తుంది. దీనిపై మెగా అభిమానులు.. కూడా చాలా ఎమోషన్ అవుతున్నారు. తమ హీరో తల్లికి ఏమైందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ఈ క్రమంలో దీనిపై చిరు ఫ్యామిలీ సన్నిహితులు స్పందించినట్లు సమాచారం.
అంజనాదేవీ తన రెగ్యులర్ చెకప్ లో భాగంగా ఆస్పత్రికి వెళ్లారని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. అయితే.. దీనిపై మాత్రం వార్తలు ఆగడం లేదు. కొంత మంది ఒక అడుగు ముందుకేసి.. అంజనావీ సీరియస్ గా ఉన్నారని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
ఈ క్రమంలో ప్రస్తుతం ఇవన్ని పుకార్లు అని మరికొందరు కొట్టిపారేస్తున్నారు. దీనిపై మెగా స్టార్ పర్సనల్ టీమ్ తాాజాగా స్పందించింది. ఇవన్ని కేవలం పుకార్లని, అంజనా దేవీ ఆరోగ్యంగా ఉన్నారని క్లారిటీ ఇచ్చారు.
మరోవైపు.. కొణిదెల వెంకటరావును వివాహం చేసుకున్న అంజనాదేవి.. ఐదుగురు సంతానం. ఇందులో మొదటి సంతానం చిరంజీవి కాగా.. ఆ తర్వాత విజయ దుర్గ కొణిదెల, కొణిదెల మాధవి, కొణిదెల నాగేంద్రబాబు, కొణిదెల పవన్ కళ్యాణ్ ఉన్నారు.