Students Holiday: తెలంగాణ విద్యార్థులకు భారీ శుభవార్త లభించింది. నెలలో మరో అదనపు సెలవు వచ్చింది. దీంతో విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులకు ఈ సెలవు లభించనుండడం విశేషం. నాలుగు లేదా ఐదు రోజులు ఉండే ఆదివారం సెలవుతోపాటు మరో అదనపు సెలవు లభించడం విశేషం. ఈ మేరకు హైదరాబాద్ జేఎన్‌టీయూ కీలక ప్రకటించింది. తన పరిధిలోని ఇంజనీరింగ్ కళాశాలలకు నాలుగో శనివారం ఆదివారం సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read: Koneru Konappa: రేవంత్ రెడ్డికి ఊహించని దెబ్బ.. కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా
జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ) పరిధిలోని కళాశాలలు, కార్యాలయాలకు ఇకపై ప్రతి నాలుగో శనివారం సెలవు దినంగా ప్రకటిస్తూ జేఎన్‌టీయూ ప్రకటించింది. ఈ మేరకు జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ కె.వెంకటేశ్వర రావు ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా ప్రకటించిన నాలుగో శనివారం సెలవు ఈనెల నుంచే అమలు కానుంది. ఈ ఉత్తర్వులు అమల్లోకి రావడంతో ఈనెల 22వ తేదీన నాలుగో శనివారం సెలవు రానుంది.
Also Read: KCR Meeting: గాయాల నుంచి కోలుకుని పుంజుకోవాలి.. గులాబీ శ్రేణులకు మాజీ సీఎం కేసీఆర్ పిలుపు
నాలుగో శనివారం కార్యాలయాలు, కళాశాలలకు సెలవు ఉండడంతో విద్యార్థులు, ఆచార్యులు, బోధన సిబ్బంది, బోధనేతర సిబ్బందికి కూడా సెలవు లభించింది. జేఎన్‌టీయూ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 423 కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలలన్నింటికి నాలుగో శనివారం సెలవు లభించనుంది. ఆయా కళాశాలల విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బందికి నాలుగో శనివారం రానుంది. అయితే నాలుగో శనివారం సెలవు అనేది గతంలోనే ఉంది. 2008కి ముందు నాలుగో శనివారం అమల్లో ఉండేది. 2008లో దీనిని రద్దు చేయగా తిరిగి దశాబ్దాల తర్వాత నాలుగో శనివారం సెలవు ప్రకటించడం విశేషం. మళ్లీ ఆ సెలవును పునరుద్ధరించడంతో విద్యార్థులు, ఉద్యోగులు, బోధనేతర సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.