8th pay Commission Gift: 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తరువాత ఒక్కొక్కటిగా ప్రక్రియ ప్రారంభమైంది. త్వరలో అంటే ఏప్రిల్ నెలలో కేంద్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయనుంది. అంతకంటే ముందు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ స్టాఫ్ కొన్ని సిఫార్సుల్ని ప్రతిపాదించింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
8వ వేతన సంఘానికి సంబంధించి అతి పెద్ద గుడ్‌న్యూస్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందనుంది. ఏప్రిల్ నుంచి ముగ్గురు సభ్యుల కమిటీ 8వ వేతన సంఘంపై పనిచేయనుంది. అంతకంటే ముందు టెర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కోసం జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ స్టాఫ్ కొన్ని సిఫార్సుల్ని ప్రతిపాదించింది. ప్రభుత్వ ఉద్యోగుల వేతన విధానం, అలవెన్సులు, ఇతర ప్రయోజనాలకు సంబంధించినవి. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల్లో 18 రకాల వేతన స్కేల్స్ ఉన్నాయి. అంటే ఒక్కో ఉద్యోగి వేతనం ఒక్కోలా ఉంటుంది. ఇప్పుడు కొత్తగా అందిన ప్రతిపాదనల ప్రకారం కొన్ని పే స్కేల్స్‌ను విలీనం చేయాలనే విజ్ఞప్తి ఉంది. అదే జరిగితే ప్రభుత్వ ఉద్యోగులకు చాలా ప్రయోజనం కలగనుంది.
జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీలో భాగంగా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ స్టాఫ్ ప్రభుత్వంతో చర్చల్లో పాల్గొంటుంది. ఇందులో వివిధ ఉద్యోగ సంఘాల నుంచి ప్రతినిధులు ఉంటారు. వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాల నుంచి ప్రభుత్వం ప్రతినిధులు ఉంటారు. ఈ జేసీఎంకు కేంద్ర కేబినెట్ సెక్రటరీ నేతృత్వం వహిస్తారు. ఉద్యోగుల వేతన విధానం, డిమాండ్లపై చర్చించేందుకు, నిర్ణయం తీసుకునేందుకు ఈ నేషనల్ కౌన్సిల్ కీలకం.
పే స్కేల్స్ విలీనంపై సిఫార్సులు
పే స్కేల్ 1 నుంచి పే స్కేల్ 6 వరకూ విలీనం చేసి ఒకటే పే స్కేల్ ఉండాలనేది ప్రతిపాదన. మొత్తం 18 పే స్కేల్స్ ఉన్నాయి. 7వ వేతన సంఘం అమల్లోకి వచ్చినప్పుడు పే స్కేల్ 1 కనీస వేతనం 18 వేలు అయింది. అదే సమయంలో పే స్కేల్ 18 వేతనం 2.50 లక్షలు అయింది. ఇప్పుడు జేసీఎంకు అందిన సిఫార్సుల ప్రకారం దిగువ స్థాయిలో ఉంటే మొదటి ఆరు పే స్కేల్స్‌ను విలీనం చేయాలి.
పే స్కేల్ 1 ఉద్యోగి కనీస వేతనం ప్రస్తుతం 18 వేలుగా ఉంటే పే స్కేల్ 2 ఉద్యోగి కనీస వేతనం 19,900 రూపాయలుగా ఉంది. ఈ రెండు విలీనమైతే పే స్కేల్ 1 ఉద్యోగికి లాభం కలుగుతుంది. 8వ వేతన సంఘంలో జీతాల పెంపును లెక్కేస్తే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.86 ఉంటే కనీస వేతనం 51,480 రూపాయలు అవుతుంది. ఇక పే స్కేల్ 3, 4 విలీనం చేస్తే 72,930 రూపాయలు అవుతుంది. అదే 2.86 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పరిగణలో తీసుకుంటే పే స్కేల్ 5,6 ఉద్యోగులకు జీతం ఏకంగా 1.01 లక్షలకు చేరుతుంది. పే స్కేల్స్ విలీనం ద్వారా ఉద్యోగులు భారీగా ప్రయోజనం పొందనున్నారు.
Also read: JEE Main 2025 Results: జేఈఈ మెయిన్స్ 2025 సెషన్ 1 ఫలితాలు, ఎక్కడ ఎలా చెక్ చేసుకోవాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి