Bird Flu Alert: ఏపీలో భారీగా బర్డ్ ఫ్లూ కేసులు.. చికెన్, గుడ్లు తినొచ్చా లేదా

Bird Flu Alert: మొన్నటి వరకూ పొరుగు రాష్ట్రాలకు పరిమితమైన బర్డ్ ఫ్లూ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కోళ్ల మరణానికి హైలీ పాథోజెనిక్ ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్ కారణమని తేలింది. ఈ నేపధ్యంలో అందరికీ కలుగుతున్న సందేహం చికెన్, గుడ్లు తినవచ్చా లేదా అని.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 11, 2025, 09:17 AM IST
Bird Flu Alert: ఏపీలో భారీగా బర్డ్ ఫ్లూ కేసులు.. చికెన్, గుడ్లు తినొచ్చా లేదా

Bird Flu Alert: బర్డ్ ఫ్లూ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. మొన్నటి వరకూ మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు పరిమితమైన ఇన్‌ఫ్లూయెంజా వైరస్ ఏపీ, తెలంగాణకు పాకింది. రెండు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో లక్షల కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. కోళ్ల మరణానికి కారణం బర్డ్ ఫ్లూ అని అధికారికంగా తేల్చారు. దాంతో కోళ్లు, గుడ్లను పూడ్చిపెట్టి..పరిసర ప్రాంతాల్లో రెడ్ జోన్ ప్రకటిస్తున్నారు. 

బర్డ్ ఫ్లూగా పరిగణిస్తున్న హైలీ పాథోజెనిక్ ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్ కారణంగా ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల్లోనే 30 లక్షల కోళ్లు మరణించాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. మరణించిన కోళ్లను, గుడ్లను కూడా పూడ్చిపెట్టి కిలోమీటర్ పరిధి వరకూ రెడ్ అలర్ట్ ప్రకటించారు. పరిసర ప్రాంతాల్లో నిఘా పెట్టారు. కోళ్ల ఫారాల్లో పనిచేస్తున్నవారి ఆరోగ్య పరిస్థితిని గమనిస్తున్నారు. భోపాల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ ల్యాబ్‌కు శాంపిల్స్ పంపి నిర్ధారణ జరిగిన తరువాత అలర్ట్ జారీ అయింది. విదేశీ వలస పక్షుల్లో ఉండే వైరస్ అవి విసర్జించే రెట్టల ద్వారా జలాశయాల్లో చేరి అక్కడ్నించి కోళ్లకు సంక్రమిస్తుందని అధికారులు చెబుతున్నారు. జనవరి వరకూ చలికాలం కావడంతో ఉష్ణోగ్రత తక్కువగా ఉండటం వల్ల కోళ్లు మరణించాయంటున్నారు. 

చికెన్, గుడ్లు తినొచ్చా, ఎలా తినాలి

అయితే ఇప్పుడు ప్రజల్లో ఉన్న సందేహం చికెన్, గుడ్లు తినొచ్చా లేదా అనేది. వాస్తవానికి రెడ్ అలర్ట్ ప్రకటించి చికెన్ తినొద్దని సూచించింది బర్డ్ ఫ్లూ ఉన్న 10 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలకే. వాస్తవానికి ఈ వైరస్ 32-34 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద జీవించి ఉండదంటున్నారు. ప్రస్తుతం ఏపీలో 34 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రత నమోదవుతున్నందున ఎలాంటి భయం లేదంటున్నారు. అదే సమయంలో చికెన్ ను సాధారణంగా మనం 20 నిమిషాల వరకు ఉడికిస్తాం. అంటే దాదాపుగా 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో వండుతాం. అందుకే ఎలాంటి భయం అవసరం లేదంటున్నారు. 

ఇక గుడ్లు కూడా ఉడకబెట్టిన గుడ్లు, గుడ్డు కూర తినొచ్చంటున్నారు. అదే ఆమ్లెట్, హాఫ్ బాయిల్డ్ ఎగ్ వంటివి తినకపోవడం మంచిదని సూచిస్తున్నారు. ఉడకబెట్టిన గుడ్లు తింటే ఎలాంటి ముప్పు ఉండదంటున్నారు పశు సంవర్ధక శాఖ అధికారులు. 

బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్, గుడ్ల ధరలు దారుణంగా పడిపోయాయి. చికెన్ మొన్నటి వరకూ కిలో 250-280 రూపాయలుగా ఉంటే ఇప్పుడు 150 రూపాయలకు పడిపోయింది. ఇక 6 రూపాయలు దాటిన గుడ్డు ఇప్పుడు 4 రూపాయలకు చేరిపోయింది. 

Also read: Chicken Alert: తస్మాత్ జాగ్రత్త, కొన్ని రోజులు చికెన్ తినవద్దు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News