Beer Price Revised In Telangana: బీర్ల సరఫరాపై కంపెనీలు తీసుకున్న సంచలన నిర్ణయానికి ఎట్టకేలకు ప్రభుత్వం దిగి వచ్చింది. బీర్ల ధరలు పెంచాలని ఒత్తిడి చేస్తున్న కంపెనీలకు ప్రభుత్వం తలొగ్గింది. దీంతో తెలంగాణలో బీర్ల ప్రియులకు భారీ షాక్ తగిలింది. బీర్ల ధరలు భారీగా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన ధరలు వెంటనే రేపటి నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించడంతో బీరు ప్రియులు ఖంగుతిన్నారు.
Also Read: Liquor Price Hike: మందుబాబులకు భారీ షాక్.. ఏపీలో మద్యం ధరలు పెంపు
బీర్ల ధరలు పెంచాలని బీర్ల తయారీ కంపెనీలు కొన్ని నెలలుగా డిమాండ్ చేస్తున్నాయి. ధరల పెంపుదలకు అంగీకరించకపోవడంతో బీర్ల సరఫరాను కొన్ని రోజులు ఆపివేసిన విషయం తెలిసిందే. ఇక బకాయిలు కూడా చెల్లిచకపోవండంతో బీర్ల కంపెనీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కంపెనీలు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం దిగివచ్చింది. బీర్ల ధరలు సవరించాలని నిర్ణయించింది. కంపెనీల డిమాండ్‌కు అనుగుణంగా ధరలు పెంచుతూ ఎక్సైజ్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఇక పెంచిన ధరలు రేపటి నుంచే (ఫిబ్రవరి 10) అమల్లోకి వస్తాయని ప్రకటించింది.
Also Read: Indiramma Indlu: తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త.. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఫ్రీ
బీర్ల ధరల పెంపుపై రిటైర్డ్ జడ్జి జైస్వాల్ నేతృత్వంలోని ధరల నిర్ణయ కమిటీ బీర్ల సరఫరాదారులకు 15 శాతం ధరల పెంపును సిఫారసు చేసింది. ఈ మేరకు ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. కమిటీ సిఫారసు మేరకు సరఫరాదారులకు 15 శాతం ధర పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ధరల సవరణతో ప్రస్తుతం ఉన్న బీర్ల ఎమ్మార్పీ 15 శాతం పెరగనుంది. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తుండడంతో బీరు ప్రియులకు భారీ షాక్ తగిలింది. ప్రభుత్వం ధరలు పెంచబోమని గతంలో ప్రగల్బాలు పలకగా తాజాగా ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter