Aghoris naga sadhus playing cricket in kumbh mela: కుంభమేళకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. కుంభమేళకు వెళ్లే మార్గాలన్ని ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రయాగ్ రాజ్ లో ప్రతిరోజు వెళ్లే భక్తుల సంఖ్యక్రమంగా పెరుగుతూనే ఉంది. 144 ఏళ్ల తర్వాత ఏర్పడిన కుంభమేళ కావడంతో ఎలాగైన త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.
ఇప్పటికే రాజకీయ రంగ ప్రముఖులు, సెలబ్రీటీలు పుణ్యస్నానాలు ఆచరించారు. ఈక్రమంలో ప్రస్తుతం కుంభమేళ అనగానే నాగసాధులు, అఘోరీలు ప్రత్యేంగా అక్కడికి పుణ్య స్నానాలకు వస్తుంటారు. వీరంతా ప్రత్యేకంగా అక్కడ సాధనలో ఉంటారు.
महाकुंभ में बाबा लोग फुर्सत में क्रिकेट खेलते हुए pic.twitter.com/MCHKHFn0h9
— 🇮🇳Jitendra pratap singh🇮🇳 (@jpsin1) February 5, 2025
కానీ కొంతమంది నాగ సాధులు స్థానికులతో కలిసి కుంభమేళకు సమీపంలోని గ్రౌండ్ లో క్రికెట్ ఆడారు. స్థానిక యువకులు బౌలింగ్ చేస్తుంటే నాగ సాధులు బ్యాటింగ్, కీపింగ్ , ఫీల్డింగ్ చేస్తున్నారు. అక్కడ సాధువులు వర్సెస్ యువత అన్నట్లుగా ఆ మ్యాచ్ నడిచింది. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
Read more: Maha kumbh: మహా కుంభమేళలో ఇంకా ఎన్ని షాహీ స్నానాలు ఉన్నాయి.. వాటి ప్రాముఖ్యత.. ఎప్పుడో తెలుసా..?
మరికొందరు భలే ఆడుతున్నారంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే కుంభమేళలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సెలబ్రీటీలు పుణ్యస్నానాలు ఆచరించారు. ఫిబ్రవరి 12, ఫిబ్రవరి 26 మరో రెండు పుణ్యస్నానాలు మిగిలి ఉన్నాయి. వీటికి భక్తులు మరింతగా తరలివచ్చేందుకు అవకాశం ఉందని తెలుస్తొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter