Pooja Hegde: అల్లు అర్జున్ సినిమాని ఘోరంగా అవమానించిన పూజా హెగ్డే..!

Pooja Hegde controversy : టాలీవుడ్లో అతి తక్కువ సమయంలోనే భారీ క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్స్ లలో పూజా హెగ్డే కూడా ఒకరు. ఈ మధ్యకాలంలో వరుసగా డిజాస్టర్లు అందుకుంటున్నప్పటికీ.. గతంలో లక్కీ హీరోయిన్గా పేరు పొందిన పూజా హెగ్డే ఇప్పుడు ఐరన్ లెగ్ అనే ముద్ర వేయించుకుంటోంది. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Feb 5, 2025, 11:05 AM IST
Pooja Hegde: అల్లు అర్జున్ సినిమాని ఘోరంగా అవమానించిన పూజా హెగ్డే..!

Pooja Hegde Ala Vaikuntapuramlo: టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోలకు జోడిగా నటించిన ఈ అమ్మడు,  తన కెరియర్ లో బ్లాక్ బస్టర్ విజయాలను కూడా అందుకున్నది. ముఖ్యంగా అల్లు అర్జున్ తో నటించిన రెండు చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.. ఒకటి DJ మరొకటి అలా వైకుంఠపురంలో..

అలా వైకుంఠపురంలో సినిమా లో పూజా హెగ్డే పాత్రకి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులన్నీ కూడా బద్దలు కొట్టి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.  ఈ సినిమాతో ఈమె కెరీర్ కూడా మరొకసారి టర్నింగ్ పాయింట్ అయ్యింది. అలా వైకుంఠపురంలో సినిమా తాను బుట్ట బొమ్మగా పేరు సంపాదించింది పూజ హెగ్డే. 

అలా బాలీవుడ్ లో పాటు ఇతర భాషలలో కూడా అవకాశాలను సంపాదించుకుంది. టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్న పూజా హెగ్డే.. ఇటీవలే ఒక సినిమా ప్రమోషన్స్లో పాల్గొనింది. ఈ సమయంలో  ఈమె పాన్ ఇండియా సినిమాల పైన పలు వ్యాఖ్యలు చేసింది. 

అయితే ఈమె మాట్లాడిన వ్యాఖ్యలకు సైతం అటు అభిమానులు ఏకిపారేయడమే కాకుండా అల్లు అర్జున్ ను  కూడా ఘోరంగా అవమానించినట్లు కనిపిస్తోంది. అలా వైకుంఠపురంలో  సినిమా ఒక తమిళ సినిమా అని బాలీవుడ్ ఆడియన్స్ ఈ సినిమాని ఎగబడి చూశారని,  అలాగే దువ్వాడ జగన్నాథం చిత్రాన్ని కూడా అలాగే చూశారని తెలియజేసిందట. అంతేకాకుండా సినిమా బాగుంటే భాషతో సంబంధం లేకుండా సినిమాల చూస్తారని,  ఈ సినిమాలను ఉదాహరణగా తెలియజేసిందట పూజా హెగ్డే.. 

అయితే ఇందులో అలా వైకుంఠపురంలో సినిమా తమిళ సినిమా ఎలా అయింది అని అల్లు అర్జున్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. పూజా హెగ్డే కెరియర్ లోని ఆల్ టైం హిట్ గా నిలిచి, ఈమె కు ఫేమ్ సంపాదించి పెట్టి, అవకాశాలను తెప్పించేలా చేసిన సినిమా పైన ఇలా మాట్లాడడం సరైనది కాదు అంటూ ఫైర్ అవుతున్నారు ఫ్యాన్స్. ఈ విషయంపై అటు పూజా హెగ్డే అభిమానులు కూడా ఫైర్ అవుతున్నారు.

Also Read: Zee Tv Sa Re Ga Ma Pa: ప్రతిష్టాత్మక వేదికలపై 'జీ సరిగమప' గాయనీలు అద్భుత ప్రదర్శన

Also Read: Rana Naidu 2 Teaser: 'రానాని ఓడించేది అతడి తండ్రి ఒక్కడే'.. వెంకీ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News