Padma Bhushan Balakrishna: భార్య వసుంధరకు టికెట్ అడిగిన బాలయ్య.. చంద్రబాబు రియాక్షన్ ఇదే..!

Chandrababu Funny Comments On Balayya: తన బామమరిది బాలకృష్ణ గురించి సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. బాలయ్య అల్లరిగా కనిపించినా.. లోపల చాలా డేడికేషన్ ఉందన్నారు. వసుంధరకు బాలయ్య టికెట్ అడిగి విషయం చెబుతూ అందరినీ నవ్వించారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Feb 3, 2025, 12:40 AM IST
Padma Bhushan Balakrishna: భార్య వసుంధరకు టికెట్ అడిగిన బాలయ్య.. చంద్రబాబు రియాక్షన్ ఇదే..!

Chandrababu Funny Comments On Balayya: నందమూరి బాలకృష్ణకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్‌ ప్రకటించడంతో కుటుంబ సభ్యులు, నందమూరి ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీలో ఉన్నారు. బాలయ్య రీసెంట్‌గా ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం.. మూడోసారి ఎమ్మెల్యేగా గెలవడం.. ఏపీ టీడీపీ మళ్లీ అధికారంలోకి రావడం.. ఈ సమయంలోనే బాలయ్యను పద్మభూషణ్ అవార్డు వరించడంతో అంతా ఉత్సాహంగా ఉన్నారు. ఈ నేపథ్యంతో బాలకృష్ణ చెల్లెలు, సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తన అన్న గౌరవార్థం సొంత ఫామ్‌హౌస్‌లో గ్రాండ్‌గా పార్టీ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు నారా, నందమూరి కుటుంబ సభ్యులతోపాటు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. చీఫ్‌ గెస్ట్‌గా సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి హాజరయ్యారు.

ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు తన చమత్కారలతో అక్కడ ఉన్న వారందరిని నవ్వంచారు. చంద్రబాబుకు మైక్‌ అందిస్తూ భువనేశ్వరి కూడా నవ్వులు పూయించారు. స్పీచ్ ఐదు నిమిషాల్లో ముగించాలని.. గంటలు గంటలు మాట్లాడేందుకు ఇది రాజకీయ ప్రసంగం కాదంటూ నవ్వించారు. నవ్వుతూ మైక్ అందుకున్న చంద్రబాబు.. అన్నాచెల్లెలు గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఓ వైపు బాలయ్య.. మరోవైపు అంతే పవర్‌ఫుల్ అయిన భువనేశ్వరి ఉన్నారని.. వీరిద్దరి మధ్యన తాను నలిగిపోతున్నానంటూ నవ్వుతూ చెప్పారు.

ఈ ఫ్యామిలీ పార్టీ గురించి కూడా తనకు తెలియదని.. తాను ఏం చేస్తున్నానో భువనేశ్వరి చెప్పలేదన్నారు. తన అన్నయ్యకు అభిమానంతో చేస్తున్నానని.. ఇందులో ఎవరికీ ప్రమేయం లేదని చెప్పి ఈ కార్యక్రమం గ్రాండ్‌గా ఏర్పాటు చేసిందన్నారు. ఇక బాలకృష్ణ గురించి మాట్లాడుతూ.. ఇప్పటివరకు అల్లరి బాలయ్య అని.. ఇప్పుడు పద్మభూషణుు అని చమత్కరించారు. ఎన్టీఆర్‌ను గుర్తు పెట్టుకునేలా నడుచుకుంటున్నరని.. అందుకు తాను ఎంతో గర్విస్తున్నానని చెప్పుకొచ్చారు. బాలయ్యకు పద్మభూషణ్‌ అవార్డు రావడం తమ కుటుంబానికి ఎంతో గర్వకారణమన్నారు. తాము ఎంతో ఆనందిస్తున్నామన్నారు.

కెరీర్‌ పరంగా చూసుకుంటే బాలయ్య తనకంటే సీనియర్ అని చంద్రబాబు చెప్పారు. బాలకృష్ణ 1974లో తొలి సినిమా చేశారని.. తాను 1978లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యానని గుర్తు చేసుకున్నారు. బాలయ్య అల్లరిగా కనిపించినా.. లోపల డెప్త్, డెడికేషన్ ఉందన్నారు. ఆయన గొప్ప మానవతా దృక్పథం ఉన్న వ్యక్తి అని కొనియాడారు. క్యాన్సర్ ఆసుపత్రిని అద్భుతంగా తీర్చిదిద్దారని మెచ్చుకున్నారు. చివర్లో కూడా నవ్వులు పూయిస్తూ ప్రసంగం ముగించారు. అప్పుడప్పుడు బాలయ్య తన అర్ధాంగి వసుంధరకు కూడా టికెట్ ఇవ్వాలని అడుగుతుంటారని.. కావాలనే అలా అడుగుతారో.. లేదా ఆమెను మెప్పించాడనికి అడుగుతారో అర్థం కాదంటూ అందరినీ నవ్వించారు. 

Also Read: Tirumala Ratha Saptami: రథ సప్తమి పర్వదినం సందర్బంగా తిరుమలలో ఏడు వాహనాలపై ఊరేగనున్న మలయప్ప స్వామి..

Also Read: Telangana BC Survey: ఇవాళే కులగణన నివేదిక.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News