Delhi Election Campaign: ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి తెర, బీజేపీ,ఆప్ మధ్య ఎవరికి విజయావకాశాలు

Delhi Election Campaign: దేశమంతా ఎదురుచూస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం ఇవాళ్టితో ముగియనుంది. ఆప్ వర్సెస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉన్నా ప్రధాన పోటీ ఆప్ వర్సెస్ బీజేపీ మధ్యే కన్పిస్తోంది. ఈసారి ఢిల్లీ పీఠం నీదా నాదా రీతిలో పోటీ నడుస్తోంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 3, 2025, 08:47 AM IST
Delhi Election Campaign: ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి తెర, బీజేపీ,ఆప్ మధ్య ఎవరికి విజయావకాశాలు

Delhi Election Campaign: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న ఉండటంతో అంతకంటే 48 గంటల ముందు ఇవాళ సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగియనుంది. దాంతో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రచారం తీవ్రతరం చేశాయి. నాలుగోసారి అధికారం కోసం ఆప్ ప్రయత్నిస్తుంటే ఎలాగైనా పీఠం చేజిక్కించుకోవాలనేది బీజేపీ లక్ష్యంగా ఉంది. 

70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు మొత్తం స్థానాల్లో పోటీ చేస్తుండగా బీజేపీ 68 స్థానాల్లో బరిలో దిగింది. మిగిలిన రెండు స్థానాల్ని జేడీయూ, ఎల్‌జేపీకు కేటాయించింది. సీపీఐ 6 స్థానాలు, సీపీఎం 2 , సీపీఐ ఎంఎల్ 2 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఇక బీఎస్పీ 70 స్థానాల్లో, ఎన్సీపీ 30, ఎంఐఎం రెండు స్థానాల్లో అభ్యర్ధుల్ని రంగంలో దింపాయి. దాదాపు అన్ని పార్టీలు పోటీలో ఉన్నప్పటికీ ఢిల్లీలో హోరా హోరీ పోటీ మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ వర్సెస్ బీజేపీ మధ్యే కన్పిస్తోంది. 

ఆప్ వర్సెస్ బీజేపీ

వరుసగా నాలుగోసారి అధికారం కోసం ఆప్ ప్రయత్నిస్తోంది. ఇదే ఆ పార్టీకు కాస్త వ్యతిరేకంగా మారింది. 2013 నుంచి అధికారంలో ఉండటంతో సహజంగానే వ్యతిరేకత పెరిగింది. దీనికితోడు టికెట్ లభించి ఏడుగురు బీజేపీలో చేరడం ఆప్‌కు కాస్త ఇబ్బందికర పరిణామమే. ఇప్పటి వరకూ అమలు చేసిన సంక్షేమ పధకాలు ముఖ్యంగా ఉచిత విద్యుత్, తాగునీరు, విద్య, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాభిస్తాయని ఆప్ అంచనా వేస్తోంది. కేజ్రీవాల్,మనీష్ సిసోడియా అరెస్టులు కూడా ప్రజల్లో సానుభూతిని పెంచాయనేది ఆ పార్టీ ఆలోచనగా ఉంది. 

ఉచిత పథకాలపై ఇన్నాళ్లు అధికార పార్టీని విమర్శించిన బీజేపీ అధికారం కోసం భారీగా ఉచిత హామీలిచ్చేసింది. డబుల్ ఇంజన్ సర్కార్ స్లోగన్ ఎత్తుకుంది. ఢిల్లీలో ఉద్యోగవర్గాలు అధికంగా ఉండటంతో ఇటీవల బడ్జెట్‌లో ట్యాక్స్ పేయర్లకు ఇచ్చిన రిలీఫ్ లాభిస్తుందని బీజేపీ భావిస్తోంది. కేజ్రీవాల్, సిసోడియా సహా ఆప్ నేతలపై ఉన్న కేసులు తమకు అనుకూలిస్తాయని బీజేపీ ఆలోచిస్తోంది. అదే సమయంలో మూడు పర్యాయాలుగా అధికారంలో ఉండటంతో ఏర్పడే ప్రభుత్వ వ్యతిరేకత లబ్ది చేకూరుస్తుందనే అంచనాలో ఉంది. 

ఇక కాంగ్రెస్ పార్టీ కనీసం ఈసారైనా ఖాతా తెరుస్తుందా అనేది సందేహంగా మారింది. ఎన్ని సీట్లు గెలుస్తుందో చెప్పలేకున్నా ఓట్లు మాత్రం గణనీయంగా చీల్చే అవకాశముంది. మజ్లిస్ పార్టీ సైతం విజయం సాధించకపోయినా రెండు నియోజకవర్గాల్లో ముస్లిం ఓట్లను చీల్చనుంది. 

ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో ప్రభావితం చేయనున్న అంశాల్లో కీలకమైంది తాగు నీటి సమస్య. ఆప్ ప్రభుత్వం ఉచిత నీరు అందిస్తున్నా మొత్తం ఢిల్లీ ప్రజానీకానికి ఆ నీళ్లు సరిపోవడం లేదు. మురుగు నీటి సమస్య మరో ఇబ్బందికర పరిణామంగా ఉంది. చాలాకాలంగా రోడ్లు వేయకపోవడంతో ఢిల్లీ రోడ్లు అంతంత మాత్రంగా ఉన్నాయి. దేశ రాజధాని కావడంతో సహజంగానే నిరుద్యోగ సమస్య భారీగా కన్పిస్తోంది.ఇలాంటి ప్రతికూలతలు, హోరా హోరీ పోటీ మధ్య ఢిల్లీ పీఠం ఈసారి ఎవరికి దక్కుతుందనేది అంచనా కష్టమౌతోంది. 

Also read: Caste Census: తెలంగాణలో తేలిన కులాల లెక్కలు, ఏ కులం జనాభా ఎంతో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News