Bank Jobs 2025: ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూసేవారికి శుభవార్త. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రిక్రూట్మెంట్ 2025 నోటిఫికేషన్ వెలువడింది. ఎన్ని పోస్టులు ఖాళీలున్నాయి, ఎవరు అర్హులు, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలు తెలుసుకుందాం.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉన్నతోద్యోగాల భర్తీకు నోటిఫికేషన్ జారీ అయింది. జనరల్ మేనేజర్ పోస్టులు భర్తీ కానున్నాయి. పే స్కేల్ 2, 3, 4, 5, 6, 7 ప్రకారం స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు మొత్తం 172 ఖాళీగా ఉన్నాయి. వీటి కోసం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అధికారిక వెబ్సైట్లో పూర్తి వివరాలు ఉన్నాయి. ఆన్లైన్ విధానంలో అప్లికేషన్లు సమర్పించాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా 172 పోస్టుల భర్తీకు ఎలాంటి వ్రాత పరీక్ష ఉండదు. ఈ ఖాళీల్లో జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్ పోస్టులు ఉన్నాయి. ఆసక్తి కలిగిన అర్హత ఉన్న అభ్యర్ధులు ఫిబ్రవరి 17 నాటికి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
అధికారిక నోటిఫికేషన్లో ఇచ్చిన క్వాలిఫికేషన్ పొంది ఉండాలి. అప్లికేషన్‌తో పాటు ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగరీ విద్యార్ధులకు 180 రూపాయలు కాగా ఎస్సీ, ఎస్టీ కేటగరీవారికి 118 రూపాయలు ఉంది. కనీస వయస్సు 22 ఏళ్లు కాగా గరిష్టంగా 55 ఏళ్లు ఉండవచ్చు.
ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. జనరల్ కేటగరీ అభ్యర్ధులు వందకు 50 మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులయితే 45 మార్కులు దక్కించుకోవాలి. అప్పుడే ఎంపిక ఉంటుంది. గడువు తేదీ ఫిబ్రవరి 17 లోగా అప్లై చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత వచ్చే అప్లికేషన్లను స్వీకరించరు. ఈ ఉద్యోగాలకు గరిష్టంగా వేతనం 1.73 లక్షలుంటుంది.
Also read: WhatsApp Governance: ఏపీ ప్రజలకు శుభవార్త, రేపట్నించే వాట్సప్ గవర్నెన్స్, ఏయే సేవలంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి