Rs 50 Murder: డబ్బుల కోసం కుటుంబసభ్యులతో గొడవపడిన యువకుడు క్షణికావేశంలో తన అమ్మమ్మను కుర్చీతో విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా రెండో అంతస్తు నుంచి బలవంతంగా ఆమెను తోసేశాడు. పై అంతస్తు నుంచి కిందపడడంతో వృద్ధురాలు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ఇదంతా రూ.50 కోసమే జరగడం విస్తుగొల్పుతుంది. ఈ ఘోర సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Land Grab: పోలీసులకే షాక్ ఇచ్చిన కబ్జారాయుళ్లు.. చార్మినార్ స్టేషన్ స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణం
వరంగల్ జిల్లాకు చెందిన కొత్తకోట సుశీలమ్మ (85)కు ఒక కుమారుడు వెంకన్న, ఇద్దరు కుమార్తెలు కళావతి, మంగమ్మ ఉన్నారు. కుమారుడు వెంకన్న వరంగల్ జిల్లాలోని నేరేడు గ్రామంలో నివసిస్తుండగా కుమార్తెలు పిల్లలతో కలిసి హైదరాబాద్ కవాడిగూడ ఉన్నికోటలో నివసిస్తున్నారు. కళావతి కుమారుడు నితిన్ సెక్యూరిటీ గార్డ్‌గా ఉద్యోగం చేస్తుంటాడు. సోమవారం సాయంత్రం డ్యూటీకి వెళ్తున్న నితిన్ ఖర్చులకు రూ.50 రూపాయలు ఇవ్వాలని కుటుంబసభ్యులను అడిగాడు.
Also Read: OU CI: మళ్లీ రెచ్చిపోయిన ఓయూ సీఐ.. స్టేషన్‌లో యువకులపై విచక్షణా రహితంగా దాడి
డబ్బులు ఇవ్వకపోతే తనను తన సోదరుడు గోపీ డ్యూటీ వద్ద దిగబెట్టాలని నితిన్ కోరాడు. ఇంట్లోని వారు ససేమిరా అన్నారు. దీంతో వాగ్వాదం మొదలైంది. కుటుంబసభ్యుల మధ్య మాటామాట పెరిగి గొడవ పెద్దది కావడంతో ఒక్కసారిగా నితిన్ తన అమ్మమ్మ సుశీలమ్మను కుర్చీతో కొట్టాడు. ఆమెపై దాడి చేయడంతోపాటు వెంటనే ఆమెను తీసుకొచ్చి రెండో అంతస్తు నుంచి కిందకు తోసేశాడు. ఈ ఘటనతో దిగ్భ్రాంతికి గురయిన కుటుంబసభ్యులు వెంటనే కిందకు వెళ్లి చూడగా సుశీలమ్మ మృతి చెందారు.
సమాచారం అందుకున్న గాంధీనగర్ పోలీసులు, క్లూస్ టీమ్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మనవడు నితిన్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతురాలు సుశీలమ్మ కూతురు కళావతి ఫిర్యాదు మేరకు గాంధీనగర్ సీఐ రాజు విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం సుశీలమ్మ మృతదేహాన్ని గాంధీ మార్చూరీకి తరలించారు. రూ.50 కోసం సొంత అమ్మమ్మను చంపేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.