Husband and inlaws injects married woman in uttar Pradesh: ఇటీవల కాలంలో చాలా మంది పెళ్లికున్న గొప్పతనాన్ని దిగజార్చే విధంగా ప్రవర్తిస్తున్నారు. పవిత్రమైన పెళ్లి బంధాన్ని బజారున పడేస్తున్నారు. నూరేళ్లు కలిసుంటామని, ఏడడుగులు వేసి.. కనీసం కాళ్ల పారణి ఆరక ముందే దారుణాలకు పాల్పడుతున్నారు. కొన్నిచోట్ల మహిళలు పురుషుల్ని వేధిస్తుండగా.. మరికొన్ని చోట్ల పురుషులు, మహిళల్ని వేధింపులకు గురిచేస్తున్నారు.
ఈ క్రమంలో ప్రస్తుతం కొంత మంది పురుషులు భార్య తనకు ఎక్కువగా కట్నం తేలేదని, కారు, బంగ్లా ఇవ్వలేదని కూడా రచ్చ చేస్తున్నారు. చీర కట్టుకొవడం రాదని, అందంగా లేదని, వంటలు వండటం రాదని భార్యల్ని వేధిస్తున్నారు. మరికొన్ని చోట్ల మహిళలు.. తమ భర్త సంపాదన అంతగా లేదని, బంగారం వంటివి కొనివ్వడంలేదని భార్యల్ని వేధిస్తుంటారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఒక భర్త తన భార్య అడిగినంత కట్నం ఇవ్వలేదని దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్‌లో ఇలాంటి షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. అడిగిన కట్నం ఇవ్వలేదనే కోపంతో యువతి భర్త, ఆమె అత్తమామలతో కలిసి కోడలికి హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చారు. కొన్ని రోజులుగా ఆమె ఆరోగ్యం దెబ్బతింది. వెంటనే పుట్టింటికి వెళ్లింది. దగ్గరలోని ఆస్పత్రిలో వెళ్లి చూయించుకొగా.. ఆమెకు హెచ్ఐవి ఉన్నట్లు వైద్యులు తెలిపారు . దీంతో మహిళ, ఆమె తల్లిదండ్రులు ఖంగుతిన్నారు.
గతంలో తన భర్త, అత్తమామలు.. ఒక ఇంజెక్షన్ ఇచ్చారని అప్పటి నుంచి తన ఆరోగ్యం మొత్తం దెబ్బతిందని మహిళ ఇంట్లో వాళ్లకు చెప్పింది. వెంటనే కుటుంబ సభ్యులు అంతా కలిసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని మహిళ అత్తింటివారిని అరెస్ట్ చేశారు.
సదరు మహిళకు..ఫిబ్రవరి 2023లో పెళ్లి జరిగింది. పెళ్లి సమయంలో.. దాదాపు 45 లక్షల రూపాయలు ఖర్చయ్యాయని చెప్పారు. అంతే కాకుండా.. వరుడికి ఎస్ యూవీ సబ్ కాంపాక్ట్ , రూ.15 లక్షల నగదు ఇచ్చినట్లు చెప్పారు. కానీ మళ్లీ అత్తామామలు.. రూ. 10 లక్షల నగదు, ఒక పెద్ద SUV ని డిమాండ్ చేసి గొడవకు దిగారని కూడా చెప్పుకొవచ్చు. అప్పట్లో పెద్దల మధ్య పంచాయతీ పెట్టి అత్తింటికి పంపించామని.. ఇంతటి ఘోరం చేస్తారని అనుకొలేదని కూడా బాధిత మహిళ బంధువులు కన్నీటి పర్యంటమౌతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter