Tamanna Bhatia: HPZ యాప్‌ స్కామ్ ఈడీ విచారణకు తమన్నా.. ఈ మనీలాండరీంగ్‌ కేసుతో మిల్కీబ్యూటీకి ఉన్న లింక్‌ ఏంటంటే..?

Tamanna Bhatia in Money Laundering: ప్రముఖ తెలుగు హిరోయిన్‌ తమన్నా భాటియా నిన్న ఈడీ విచారణకు హజరయ్యారు. మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కేసులో భాగంగా ఆమె గురువారం గువహాటీలోని ఈడీ ఆఫీసులో హాజరు అయ్యారు. మనీలాండరీంగ్‌ కేసుకు సంబంధించి ఈడీ ఈ విచారణ చేపట్టింది. ముఖ్యంగా ఆన్‌లైన్‌ గేమింగ్‌ యాప్‌ అయిన మహాదేవ్‌ బెట్టింగ్‌కు సంబంధించి ఈ విచారణ చేపట్టింది.

Written by - Renuka Godugu | Last Updated : Oct 18, 2024, 06:52 AM IST
Tamanna Bhatia: HPZ యాప్‌ స్కామ్ ఈడీ విచారణకు తమన్నా.. ఈ మనీలాండరీంగ్‌ కేసుతో మిల్కీబ్యూటీకి ఉన్న లింక్‌ ఏంటంటే..?

Tamanna Bhatia in Money Laundering: మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ స్కామ్‌కు సంబంధించిన కేసులో ప్రస్తుతం హిరోయిన్‌ తమన్నా పేరు బయటకు వచ్చింది. ఇప్పటికే ఈ కేసులో రణబీర్‌ కపూర్‌, శ్రద్ధకపూర్‌లను కూడా విచారించిన ఈడీ. గురువారం తమన్నాను విచారించింది. గువహటీలోని ఈడీ ఆఫీసుకుని తమన్నా తన తల్లితో కలిసి హాజరు అయింది.ఈడీ తమన్నాను మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ మనీలాండరింగ్‌ గురించి విచారణ చేపట్టింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈడీ తమన్నాను దాదాపు 8 గంటలపాటు విచారించింది. అయితే, ఈ స్కామ్‌తో డైరెక్ట్‌గా తమన్నాకు లింకులు లేవు కానీ, మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌కు సంబంధించిన ఓ షోలు తమన్నా పాల్గొంది. దీనికి ఆమె డబ్బు కూడా తీసుకున్నారట.

మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ అనేది చట్టవిరుద్ధమైన ఆన్‌లైన్‌ గేమింగ్‌ యాప్‌. దీన్ని తమన్నా చట్టవిరుద్ధంగా ప్రచారం చేశారని విచారణకు పిలిచారు. అయితే, ఇది వరకే ఈ కేసు విచారణకు సంబంధించిన అనేక సార్లు తమన్నాకు సమన్లు వెళ్లాయి. కానీ, ఆమె బిజీగా ఉండటంతో నిన్న హాజరు అయ్యారు.

ఇదీ చదవండి: ఐఆర్‌సీటీసీలో కీలక మార్పు.. అడ్వాన్స్‌ బుకింగ్‌ గడువు 60 రోజులకు తగ్గింపు..!  

మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ ఏంటి?
ఈ మోసపూరిత ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌కు సంబంధించి ఈడీ ఇప్పటి వరకు మొత్తం 299 సంస్థలను నిందుతులుగా చేర్చింది. అంతేకాదు స్కామ్‌ గేమ్‌కు సంబంధించి పది మంది డైరెక్టర్లు చైనీస్‌ మూలాలకు చెందినవారుగా గుర్తించింది. ఇందులో మరో ఇద్దరు విదేశీయులు. ఇందులో నిందితులుగా చేర్చిన సంస్థలు కూడా 76 చైనా ఆధ్వర్యంలో పనిచేస్తున్న సంస్థలు.

ముఖ్యంగా బిట్‌కాయిన్‌, క్రిప్టోకరేన్సీ మైనింగ్ పేరిట ఇన్వెస్టర్లను మోసం చేసినందుకు ఐపీసీ, ఐటీ యాక్ట్‌ ప్రకారం ఈ బెట్టింగ్‌ యాప్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కొహిమా పోలీసులు సైబర్‌ క్రైమ్‌ విభాగం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఆ తర్వాతే ఈ మనీలాండరీంగ్‌ కేసు గురించిన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఇదీ చదవండి:  మరో టీడీపీ నేత రాసలీలలు..రాత్రికి వస్తేనే పింఛన్ అంటున్న రసిక రాజా.. వీడియో దొరికేసింది..

ముఖ్యంగా ఈ బెట్టింగ్‌ యాప్‌లో రూ.57,000 పెట్టుబడి పెడితే ప్రతిరోజూ రూ.4,000 ఆదాయం పొందవచ్చని మోసం చేసింది. కేవలం ఒక్కసారి కడితే చాలు అన్నారు. పెట్టుబడిదారుల నుంచి భారీ మొత్తం డబ్బు వసూలు చేయడానికి ఈ హెప్‌పీజెడ్‌ టోకెన్‌ యాప్‌ ఉపయోగించారని పోలీసులు చెప్పారు. కోట్లాది రూపాయలు ఈ యాప్‌ ద్వారా మోసం చేశారు. దీనికి డొల్ల కంపెనీల పేరుతో వివిధ బ్యాంకుల్లో నకిలీ ఖాతాలు తెరిచి అందులో పెట్టుబడిదారుల నుంచి నగదు బదిలీ చేశారు. నిందితులు ఈ డబ్బును క్రిప్టో, బిట్‌కాయిన్లలో పెట్టుబడి పెట్టారు. దాదాపు రూ.455 కోట్ల ఆస్తులు, డిపాజిట్లను ఈడీ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. ‌ఈ యాప్‌ను ప్రమోట్‌ చేసినందుకు తమన్నా ఈడీ విచారణకు హాజరు కావాల్సి వచ్చింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News