Snake Viral Video: పాము అంటేనే పడుతూ లేస్తూ పారిపోయే వారు సైతం ఈ వీడియో చూస్తే నోరెళ్లబెట్టకుండా ఉండలేరు. హే.. పాము ఇంత ఈజీనా అనుకోక తప్పదు. పొరపాటున నెక్ట్స్ టైమ్ మీరు ఇలానే చేయగలరు. కానీ, ఈ వీడియోలో మాత్రం ఆ మహిళ ధైర్యానికి అందరూ దండం పెడుతున్నారు. నీటి గుంతలో వలలో చిక్కుకున్న పామును ఓ మహిళ ఒడ్డుకు తీసుకువచ్చి దాని చుట్టూ ఉన్న వలను సులభంగా కట్ చేసి పామును కాపాడింది.
ఒట్టి చేతులతో పాము మూతి వద్ద ఉన్న నెట్‌ను కూడా ఈజీగా కట్‌చేసింది. చేతిలో కేవలం కత్తెరతో ఈ వలను సింపుల్‌గా కట చేసింది. నీటి ఒడ్డుకు తీసుకువచ్చి ఎంచక్కా కింద కూర్చొని పాముకు ఉన్న నెట్ అంతా కట్ చేసింది. అసలు పాము మూతిలో చిక్కుకున్న నెట్ కట్ చేయడం కూడా అంత సులభం కాదు. పాముకు గాయం అవ్వకుండా ఆ పని చేయాలి. పాము ఇదంతా గమనిస్తూ మెల్లిగా జారుకోవాలని ప్రయత్నిస్తూనే ఉంది కానీ, ఆ మహిళ మాత్రం తన పని తాను చేసుకుంటూ పోయింది. వలకు ఉన్న ఒక్కో నెట్‌ను కట్ చేస్తూ పోయింది. అంతేకాదు ఆ మహిళ పాము తన పెంపుడు జంతువు అన్నట్లు దాంతో ముచ్చట పెడుతూ నెట్ కట్ చేసింది. ఈ వీడియో ఎక్స్ వేదికగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇక నెట్ పూర్తిగా కట్ చేసిన తర్వాత మళ్లీ నీటి గుంత వద్దకు వెళ్లి పామును వదిలేసింది.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
ఈ వీడియోను పక్కనే ఉన్న ఓ స్కూలు విద్యార్థిని వీడియో తీసింది. ఇద్దరు విద్యార్థినులు అక్కడ ఉన్నారు. ఆ పామును దగ్గరగా చూసి అమ్మాయి కేకలు కూడా వేసింది. కానీ, ఆ ధీరవనిత మాత్రం అనుకున్న పని సాధించింది. మూసు అనే పేజీపై ఈ వైరల్ వీడియో ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. నెట్టిజెన్లు సైతం ఆమె చేసిన పనికి ఫిదా అయ్యారు. హర్ హర్ మహాదేవా.. అని కొందరు కామెంట్లు పెట్టారు. ఇప్పటికే కొన్ని మిలియన్ల మంది ఈ వీడియోను చూశారు. వారి కామెంట్లు పెడుతున్నారు. ఆమె సమాజ సేవ బాగా చేస్తుందని కొందరు కామెంట్లు పెడుతుండగా మరి కొందరూ ఎక్స్‌లెంట్ జాబ్ అని ధీర వనితను కొనియాడుతున్నారు.
आश्चर्यजनक..
जब विश्वास हो अपने भोलेनाथ पर तो फिर किस बात का डर..#हर_हर_महादेव 🙏 pic.twitter.com/gadt9plcV7
— MuSu🕊️ (@kritya1176) October 14, 2024
ఆమె ఎంతో ధైర్యవంతురాలు ఇది అందరకీ సాధ్యంకాదు అని ఈ స్నేక్ వైరల్ వీడియో చూసిన నెట్టిజెన్లు కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రపంచం మొత్తం ఎన్నో రకాల పాము జాతులు ఉన్నాయి. ఇందులో అత్యధిక శాతం విషసర్పాలు. ఏటా ఎన్నో లక్షల మంది కూడా పాము కాటుకు గురై చనిపోతున్నారు. అందుకే పాము అంటేనే అందరూ భయభ్రాంతులకు గురవుతారు. సోషల్ మీడియాలో కూడా ఇలాంటి పాము వీడియోలు వైరల్ అవుతుంటాయి. పాము వీడియోలు చూడటానికి ఆసక్తి ఉన్నవారు సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తూనే ఉంటారు. కామెంట్లు పెడుతునే ఉంటారు. లైక్ కూడా కొడతారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి