Nagarjuna: మంత్రి కొండా సురేఖపై రూ. 100 కోట్లకు మరో దావా వేసిన నాగార్జున..

Nagarjuna Files Another Defamation Case On Konda Surekha: తన అనుచిత వ్యాఖ్యలతో అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి భంగం కలిగించిన మంత్రి కొండా సురేఖపై ఇప్పటికే నాంపల్లి కోర్టులో క్రిమినల్ పరువు నష్టం కేసు దాఖలు చేసిన సినీ నటుడు నాగార్జున.. తాజాగా ఆమె పై రూ. 100 కోట్లకు మరో పరువు నష్టం దావా దాఖలు చేసారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Oct 7, 2024, 01:45 PM IST
Nagarjuna: మంత్రి కొండా సురేఖపై రూ. 100 కోట్లకు మరో దావా వేసిన నాగార్జున..

Nagarjuna Files Another Defamation Case On Konda Surekha: తన కుటుంబ పరువు పోయేలా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ ఏకమైంది. సమంతతో పాటు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో డీసెంట్ ఫ్యామిలీగా పేరు తెచ్చుకున్న  అక్కినేని కుటుంబం పై అనుచిత వ్యాఖ్యలు చేయడం పెద్ద కలకలమే రేపింది. నాగార్జున కుటుంబంపై అనరాని మాటలతో విరుచుపడిన మంత్రి కొండా సురేఖ. ఇప్పటికే తన వ్యాఖ్యలపై క్షమాపణలు కోరింది మంత్రి కొండా సురేఖ. మరోవైపు నాగార్జున మంత్రిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని తన పిటిషన్ లో పేర్కొన్నారు. తాజాగా నాగార్జున దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు విచారిస్తోంది. ఈ నేపథ్యంలో నాగార్జున ఎక్కడా తగ్గకుండా తన కుటుంబ పరువు గంగ పాలయ్యేలా చేసిన కొండా సురేఖపై రూ. 100 కోట్లకు పరువు నష్టం దావా వేయడం ఆసక్తి రేకిస్తోంది.

కొండా సురేఖ.. తనపై ట్రోలింగ్ చేయించిన కేటీఆర్ పై రాజకీయ దాడి చేయడంలో భాగంగా అక్కినేని ఫ్యామిలీని రచ్చ కీడ్చడం సినీ, రాజకీయ వర్గాల్లో పెద్ద సంచలనమే అయింది. ఆ సందర్భంగా కేటీఆర్.. నాగార్జున ఆస్తులను కాపాడుకోవాలంటే ఆమె కోడలైన సమంతను తన దగ్గరకు రమ్మన్నట్టు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అగ్గికి ఆజ్యం పోసాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా నోటికొచ్చినట్టు ఒక డీసెంట్ ఫ్యామిలీపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు ఈ అంశంపై రేవంత్ రెడ్డి సహా ఆయన క్యాబినేట్ సహచరులు ఎవరు ఈ విసయాన్ని ఖండించలేకపోవడం విచారకరం. ఒక ఫ్యామిలీతోపాటు ఓ ఆడపిల్ల బతుకును బజారు కీడ్చిన వైనం కళ్ల ముందు కనబడుతున్న ధృతరాష్ట్రుడి తరహాలో రేవంత్ రెడ్డి ప్రవర్తించడం కడు శోచనీయమని సినీ వర్గాలతో పాటు బీజేపీ, బీఆర్ఎస్ వర్గాలు ముఖ్యమంత్రి ప్రవర్తిస్తున్న తీరును ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. 

ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..

ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..

మొన్న ఎన్‌ కన్వెన్షన్‌, విడాకులు ఇలా రెండింటిని కలిపి అతి జుగుప్సకరమైన  వ్యాఖ్యలు కొండా సురేఖ చేయడం సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం తెలిసిందే. సినీ పరిశ్రమ మొత్తం నాగార్జున కుటుంబానికి అండగా నిలబడింది. సినీ నిర్మాతలు, దర్శకులు, నటీనటులు అంతా ఒక్క తాటిపైకి వచ్చి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై తమ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మాత్రం బేషరుతుగా కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కోరుతున్నారు. ఒక ఆడదై ఉండి మరో ఆడదానిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటనే ప్రశ్నలు  లేవనెత్తుతున్నారు.

ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..

ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x