Best Way To Reduce Belly Fat In Telugu: పొట్ట పై భాగంలో బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా పెరిగిపోవడం వల్ల మనిషి అందాన్ని కోల్పోతాడు అంతేకాకుండా చాలా లావుగా కనిపించే అవకాశాలు ఉన్నాయి దీంతోపాటు అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల మారిన కూడా పడతారు. ప్రస్తుతం చాలామంది ఈ బెల్లీ ఫ్యాట్ సమస్యతో బాధపడుతున్నారు. నిజానికి బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడం అంత సులభం కాదు. ఎంతో కష్టపడితే కానీ ఈ బెల్లీ ఫ్యాట్ కరగదు. అయితే ఈరోజు సెలబ్రిటీస్ ఈ బెల్లీ ఫ్యాట్ నుంచి ఉపశమనం పొందడానికి అనుసరించే న్యూట్రిషన్ పద్ధతులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
నిజానికి బరువు పెరగడం అనేది చిన్న సమస్య అయినప్పటికీ భవిష్యత్తులో అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీయవచ్చు. బరువు పెరగడం కారణంగా శరీరంలోని వివిధ భాగాల్లో కొవ్వు వేగంగా పేరుకు పోతుంది. ముఖ్యంగా పొట్టపై భాగంలో ఎక్కువగా కొవ్వు పేరుకుపోయి, బెల్లీ ఫ్యాట్ ఏర్పడుతుంది. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి చాలామంది వివిధ పద్ధతులను అనుసరిస్తూ ఉంటారు. ఎంత కష్టపడినప్పటికీ కఠిన తరమైన వ్యాయామాలు చేసినప్పటికీ చాలామంది ఈ సమస్య నుంచి ఉపశమనం పొందలేకపోతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యతో బాధపడేవారు తప్పకుండా కొన్ని పద్ధతులను వినియోగించాల్సి ఉంటుంది.
ముఖ్యంగా చాలామంది ఆహారాలు తీసుకున్న వెంటనే టీవీ లేదా మొబైల్ చూస్తూ కూర్చుండి పోతారు. ఇలా తిన్న వెంటనే కూర్చోవడం కారణంగా బెల్లీ ఫ్యాట్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమస్య నుంచి ఉపశమనం పొందే క్రమంలో తిన్న వెంటనే పది నిమిషాల పాటు తప్పకుండా వాకింగ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల జీవనశక్తి కూడా పెరుగుతుంది.. దీంతోపాటు రాత్రిపూట కేవలం తేలికపాటి ఆహారాలు మాత్రమే తీసుకోవాలి. అంతేకాకుండా నీటిని కూడా ఎక్కువగా తాగడం వల్ల సులభంగా బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవచ్చు.
చాలామంది వేసవికాలంలో బరువు తగ్గే క్రమంలో చల్లని వాటర్‌ని తీసుకుంటూ ఉంటారు. నిజానికి ఇలా తీసుకోవడం కారణంగా దాహం తీరుతుంది. కానీ బరువు తగ్గే అవకాశాలు లేవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గడానికి బెల్లీ ఫ్యాట్ నియంత్రించుకోవడానికి ప్రతి రోజు చల్లటి నీటికి బదులుగా గోరువెచ్చని నీటిని తాగడం చాలా మంచిది. అంతేకాకుండా గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగడం వల్ల సులభంగా రెట్టింపు లాభాలు పొందుతారు.
చాలామంది బిజీ లైఫ్ కారణంగా ఎక్కువగా కష్టపడి పనిచేసే త్వరగా నిద్రపోతూ ఉంటారు. నిజానికి బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలనుకునేవారు తప్పకుండా రోజులో కొంత సమయమైనా విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఈ సమయంలో శ్వాస వ్యాయామాలు చేయడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడి పొట్ట పై భాగం కొవ్వు సులభంగా తగ్గుతుంది. అలాగే ఈ సమయంలో తీసుకునే ఆహారాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించడం ఎంతో మంచిది ఆకలిగా అనిపించినప్పుడు అనారోగ్యకరమైన ఆహారాలు తినకపోవడం మరి ఎంతో మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఆకలిగా ఉన్నప్పుడు నీటిని తీసుకోవడం వల్ల సులభంగా శరీర బరువు నియంత్రించుకోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి