రవితేజ నిర్మాతగా వ్యవహరించిన చాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ

సినిమాలతో బిజీగా ఉంటూనే హీరో రవితేజ సినిమాలను నిర్మిస్తూ ఉన్నారు. అలా వచ్చిన సినిమానే ఛాంగురే బంగారు రాజా. ఈ రోజు విడుదలైన సినిమా ఎలా ఉందంటే..?

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 15, 2023, 05:35 PM IST
రవితేజ నిర్మాతగా వ్యవహరించిన చాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ

Changure Bangaru Raja: అటు సినిమాల్లో బిజీగా ఉంటూనే.. మాస్ మహారాజ రవితేజ అపుడపుడు నిర్మాతగా మారి కొన్ని సినిమాలను చిత్రిస్తున్న సంగతి తెలిసిందే. రవితేజ నిర్మాతగా ఉండి.. యంగ్ యాక్టర్లతో నిర్మించిన చిత్రమే "ఛాంగురే బంగారు రాజా". విడుదల అయిన ఈ సినిమా ఎంత వరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో చూద్దాం. 

కథ:
ఇక కథ లోకి వెళ్తే.. బంగార్రాజు (కార్తీక్ రత్నం) నర్సీపట్నం దుగ్గాడ ప్రాంతంలో ఉంటాడు. ఇతడొక ఓ బైక్ మెకానిక్. అయితే హీరో ఉండే ప్రాంతములోనే రంగు రాళ్లు దొరుకుతాయని ప్రసిద్ధి. ఇలా ఉండగా.. బంగార్రాజుకి సోము నాయుడు (రాజ్ తిరందాసు) వ్యక్తితో గొడవ జరుగుతుంది. కానీ గొడవ తరువాత సోము నాయుడు అనుస్పదంగా మరణిస్తాడు. ఫలితంగా ఆ కేసులో బంగార్రాజు అరెస్టు అవుతాడు.  ఈ కేసులోంచి బంగార్రాజు బయట పడడ్డా..? బయటపడితే ఎలా బయటపడ్డాడు.. ? తాతారావు (సత్య) లాఫ్ గీతులు (రవి బాబు) మధ్య ఉన్న కనెక్షన్ ఏంటి.. ? అనే అంశాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ప్లస్ పాయింట్స్:
ఈ సినిమా థీమ్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నటుడు కార్తీక్ రత్నం అద్భుతమైన నటన కనబరిచాడు. కార్తీక్ రత్నం డైలాగ్ డెలివరీ, సహజ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సినిమాలో తను పండించిన కామెడీ కూడా బాగుంటుంది. ఇక సెకండాఫ్ విషయానికి వస్తే.. సినిమాలో రవిబాబు ఎంట్రీతో.. కామెడీ మరో లెవల్ కి వెళ్ళిపోతుంది. ఎప్పటిలాగానే తన రోల్ ను మంచి కామికల్ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. ఇక మిగతా నటీనటులు మంచి నటనతో పాత్రల మేరకు ఆకట్టుకోగలిగారు. 

Also Read: Birth Certificate: ఇక నుంచి బర్త్ సర్టిఫికెట్ చాలు గురూ.. అన్నింటికి సింగిల్ డాక్యుమెంట్‌గా..  

సినిమాకి నటుడు సత్య చాలా ప్లస్ అవుతాడు. సత్య - నిత్యల మధ్య జరిగే లవ్ స్టోరీ చాలా కామెడీగా సాగుతుంది. ఒక కథని వేరు వేరు వ్యక్తులు వారి వారి కోణంలో చూస్తే ఎలా ఉంటుందో అన్న కోణంలో సినిమా తెరకెక్కించారు. హత్య చుట్టూ ఉండే వ్యక్తులు.. వారి వారి కోణం నుంచి సినిమా సాగుతుంది. స్క్రీన్ ప్లే అద్భుతంగా సాగుతుంది. ప్రతి కోణంలోంచి కథని చూపించి కరెక్ట్ గా కనెక్ట్ చేశాడు దర్శకుడు. ఇలాంటి కథతో పలు సినిమాలు వచ్చినా తక్కువ బడ్జెట్ లో రవితేజ మంచి ఎంటర్టైనింగ్ గా సాగే సినిమానే నిర్మించాడు. 

మైనస్ పాయింట్స్:
సినిమాలో ఉన్న ఒక సాంగ్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. 

ఇక మొత్తంగా చూసుకుంటే.. “చాంగురే బంగారు రాజా” చిత్రంలో నటుడు కార్తీక్ రత్నం మంచి నటన కనబరిచాడనే చెప్పాలి. సినిమాలో అక్కడక్కడ కామెడీ సీన్స్ బాగుంటాయి, దర్శకుడు మరికాస్త జాగ్రత్త వహించి ఉంటే బాగుండు అనిపించింది.

రేటింగ్: 2.75

Also Read: MLC Kavitha: ఈడీ నోటీసులను లైట్‌ తీసుకున్న ఎమ్మెల్సీ కవిత.. విచారణకు డుమ్మా..?   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x